ఏపీలో జోరుగా కోళ్ల పందాల నిర్వహణ!

కోనసీమలో కోడి పందాలు నిర్వహించకపోతే.. సందడే ఉండదు. ఏటా సాంప్రదాయంగా వస్తోన్న కోళ్ల పందేల కోసం ఒకవైపు పుంజులు కాళ్లు దువ్వుతుంటే.. మరోవైపు పందెం రాయుళ్లు బరులను సిద్ధం చేస్తున్నారు. వీటికి ఇప్పుడు ఏపీలో ఏర్పాట్లు మామూలుగా లేవు. అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే లెవల్‌లో ఈ కోడి పందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆంక్షల పేరుతో పోలీసులు అడ్డుపడ్డా.. పందాలు జరిపి తీరుతామంటున్నారు ఏపీ వాసులు. ఒకపక్క పోలీసుల ఆంక్షలు ఉన్నా కూడా.. లెక్కచేయకుండా ఏర్పాట్లు చేశారు తూర్పుగోదావరి […]

ఏపీలో జోరుగా కోళ్ల పందాల నిర్వహణ!
Follow us

| Edited By:

Updated on: Jan 14, 2020 | 1:53 PM

కోనసీమలో కోడి పందాలు నిర్వహించకపోతే.. సందడే ఉండదు. ఏటా సాంప్రదాయంగా వస్తోన్న కోళ్ల పందేల కోసం ఒకవైపు పుంజులు కాళ్లు దువ్వుతుంటే.. మరోవైపు పందెం రాయుళ్లు బరులను సిద్ధం చేస్తున్నారు. వీటికి ఇప్పుడు ఏపీలో ఏర్పాట్లు మామూలుగా లేవు. అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే లెవల్‌లో ఈ కోడి పందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆంక్షల పేరుతో పోలీసులు అడ్డుపడ్డా.. పందాలు జరిపి తీరుతామంటున్నారు ఏపీ వాసులు.

ఒకపక్క పోలీసుల ఆంక్షలు ఉన్నా కూడా.. లెక్కచేయకుండా ఏర్పాట్లు చేశారు తూర్పుగోదావరి జిల్లాలోని ఎదుర్లంక గ్రామస్తులు. అనాధిగా వస్తోన్న ఆచారాన్ని ఎలా పక్కన పెడతామంటున్నారు. పోలీసులు టెంట్లు ధ్వంసం చేసి.. తొలగించినా కూడా.. మళ్లీ అక్కడే ఏర్పాట్లు చేసి నిర్వహిస్తున్నారు గ్రామస్తులు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా మేము సైతం అంటూ.. పందేల్లో పాల్గొంటున్నారు. పండుగ నాలుగు రోజులూ ఈ హడావిడి ఖచ్చితంగా ఉంటుందని అక్కడి గ్రామస్తులు పేర్కొంటున్నారు. అక్కడే కాకుండా ఏపీ వ్యాప్తంగా కూడా కోళ్ల పందేల నిర్వహణ జోరుగా నడుస్తోంది. కాగా ఈ కోళ్ల పందేల్లో.. కాకి, డేగ, పచ్చ డేగ, నెమలి, ఆబ్రాస్, రసంగి, ఎర్ర నెమలి, పండు డేగ, పర్ల, పింగల, మైల పలు జాతులు కనిపిస్తాయి.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??