కృష్ణాజిల్లా మైలవరంలో జోరుగా కోడి పందేలు, మధ్యాహ్నం వరకు హడావుడి చేసి తర్వత పత్తాలేకుండా పోయిన పోలీసులు

కోడిపందేలకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతిలేదు, పందేలకోసం వచ్చి లాడ్జీలు, హోటళ్లు బుక్ చేసుకుంటే ఐటీ రైడ్స్ కూడా అదనం అంటూ వారంరోజులుగా..

  • Venkata Narayana
  • Publish Date - 3:49 pm, Wed, 13 January 21

కోడిపందేలకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతిలేదు, పందేలకోసం వచ్చి లాడ్జీలు, హోటళ్లు బుక్ చేసుకుంటే ఐటీ రైడ్స్ కూడా అదనం అంటూ వారంరోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో పోలీసులు ఊదరగొట్టారు. చివరికి అవన్నీ డాంబికాలుగానే తేలిపోయాయి. కృష్ణాజిల్లాలో జోరుగా కోడిపందేలు, గుండు ఆటలు, కోసుముక్క వగైరా ఆటలు జోరుగా సాగుతున్నాయి. మైలవరంనూ జోరుగా పందాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం వరకు హడావుడి చేసిన పోలీసులు, ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు.

ఇంకేముంది పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. బరులన్నీ జాతర వాతావరణాన్ని తలపిస్తున్నాయి. నిర్వాహకులు కత్తి కట్టి కోడి పందేలు వేస్తుంటే, జనం కరోనాని కూడా సైతం లెక్క చేయకుండా పాల్గొంటున్నారు. మరోవైపు – కోసుముక్క, గుండాట కూడా జోరుగా నడుస్తూ జనం జేబులకు చిల్లులు పెడుతున్నాయి. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.