పగ పట్టిన తాచు.. రెండు కిలో మీటర్లు పరిగెత్తించి.. చివరకు..

పాములు పగపడతాయా.. అంటే చాలా మంది నుంచి అవుననే సమాధానమే వస్తుంది. ఎందుకంటే.. ముఖ్యంగా తాచు పాము పగపడుతుందని.. దానిని పొరపాటున కూడా ఎమైనా అంటే.. ఎక్కడ ఉన్నా.. అది వదిలి పెట్టదని మెజార్టీ ప్రజలు భావిస్తారు. అంతేకాదు.. పాము పగ పన్నెండేళ్లైనా పొదన్న వాదన కూడా వినిపిస్తారు. అయితే.. పన్నెండేళ్లు పగ పడుతుందో లేదో కానీ.. యూపీలోని జలాన్ జిల్లాలో జరిగిన ఘటన చూస్తే.. ఇది నిజమేనేమో అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రానికి చెందిన గుడ్డు […]

పగ పట్టిన తాచు.. రెండు కిలో మీటర్లు పరిగెత్తించి.. చివరకు..
Follow us

| Edited By:

Updated on: Dec 05, 2019 | 2:25 AM

పాములు పగపడతాయా.. అంటే చాలా మంది నుంచి అవుననే సమాధానమే వస్తుంది. ఎందుకంటే.. ముఖ్యంగా తాచు పాము పగపడుతుందని.. దానిని పొరపాటున కూడా ఎమైనా అంటే.. ఎక్కడ ఉన్నా.. అది వదిలి పెట్టదని మెజార్టీ ప్రజలు భావిస్తారు. అంతేకాదు.. పాము పగ పన్నెండేళ్లైనా పొదన్న వాదన కూడా వినిపిస్తారు. అయితే.. పన్నెండేళ్లు పగ పడుతుందో లేదో కానీ.. యూపీలోని జలాన్ జిల్లాలో జరిగిన ఘటన చూస్తే.. ఇది నిజమేనేమో అనిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్రానికి చెందిన గుడ్డు పచౌరీ అనే వ్యక్తి తన టూ వీలర్‌పై ఓ గ్రామానికి వెళ్తున్నాడు. అయితే అనుకోకుండా.. రోడ్డుపై అటుగా వెళ్తున్న ఓ తాచు పాము తొకపై నుంచి తన బైక్ పోనిచ్చాడు. అంతే.. ఇంకేముంది. ఆ పాము.. ఆ బైక్‌ను వెంబడించడం ప్రారంభించింది. అయితే ఈ విషయాన్ని తొలుత పచౌరీ గమనించలేదు. కానీ ఆ పాము తొకపై నుంచి వెళ్లానన్న విషయం మాత్రం మైండ్‌లో పెట్టుకున్నాడు. అయితే కాస్త దూరం వెళ్లాక వెనక్కి తిరిగి చూశాడు. అంతే.. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ పాము బైక్‌ను వెంబడించడం గమనించి.. భయంతో వణికిపోయాడు. బైక్ స్పీడ్ పెంచి దాదాపు రెండు కిలోమీటర్ల వరకు వేగంగా వెళ్లాడు. అయినా కూడా.. ఆ పాము వెంబడిస్తూ వచ్చింది. అంతే కాదు.. ఓ క్షణంలో అతని పాదాన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. ఈ క్రమంలో ఆ పాము.. ఆ బైక్‌పైకి ఎగబాకిందట. దీంతో భయంతో ఆ బైక్‌ను అక్కడే వదిలేసి.. పరుగెత్తడం ప్రారంభించాడు పచౌరీ. అయితే బైక్‌పై ఉన్న పామును చూస్తూ.. జనం అలానే ఉండిపోయారు. అయితే ఆ పాము ఎంతకూ కదలకపోవడంతో.. దానిపైకి రాళ్ల దాడి చేశారు స్థానికులు. అయితే ఆగ్రహంతో ఆ పాము బుసలు కొడుతూ.. అందర్నీ భయబ్రాంతులకు గురిచేసిందట. చివరకు ఓ అరగంట గడిచిన తర్వాత.. శాంతించిన ఆ తాచు.. మెల్లిగా బైక్ దిగి సమీప పొదల్లోకి చేరుకుందట.

అయితే ఈ ఘటన చూసిన వారంతా.. పాము పగ పడుతుందటే ఇదేనేమో అని గుసగుసలాడుకున్నారట.