సచిన్, ధోని సహా బడా క్రికెటర్లతో స్నేహం.. ఇంతకు ఈయనెవరో తెలుసా..!

సచిన్, ధోని, రైనా, డీవిలియర్స్, డేవిడ్ వార్నర్, గేల్.. ఇలా బడా క్రికెర్లందరూ ఆయనకు స్నేహితులు. వారందరూ భాస్కర్ అని ఆయనను పిలుచుకుంటారు. అంతేకాదు మ్యాచ్‌లు జరిగినప్పుడు వారి పక్కనే ఉంటారు ఈయన.

సచిన్, ధోని సహా బడా క్రికెటర్లతో స్నేహం.. ఇంతకు ఈయనెవరో తెలుసా..!
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2020 | 9:22 PM

సచిన్, ధోని, రైనా, డీవిలియర్స్, డేవిడ్ వార్నర్, గేల్.. ఇలా బడా క్రికెర్లందరూ ఆయనకు స్నేహితులు. వారందరూ భాస్కర్ అని ఆయనను పిలుచుకుంటారు. అంతేకాదు మ్యాచ్‌లు జరిగినప్పుడు వారి పక్కనే ఉంటారు ఈయన. అలాగని ఈయన కోచ్, ఫిట్‌నెస్ ట్రైనర్ కాదు. ఇంతకు ఈయనెవరో తెలుసా..! షూ మొదలు, గ్లౌజ్‌లు, పాడ్స్, హెల్మెట్.. ఇలా క్రికెటర్లకు సంబంధించిన వస్తువులకు రిపేర్లు చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే టీమిండియాకు సంబంధించి ఆయన అధికారిక కోబ్లార్(తోలు వస్తువులు బాగు చేసే వ్యక్తి).

చెన్నైకు చెందిన భాస్కరన్.. గత 27 సంవత్సరాలుగా క్రికెటర్లకు కోబ్లార్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వన్‌డే మ్యాచ్‌లే కాదు పలు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను కూడా ఆయన క్రికెటర్ల పక్క నుండి చూశారు. సచిన్, ధోని, డీవిలియర్స్.. వీరందరి షూ సైజ్‌లు ఈయన అనర్గళంగా చెప్పగలరు. ఒక్క బ్యాట్ రిపేరింగ్ తప్ప తనకు అన్నీ వచ్చని ఆయన చెబుతున్నారు. ధోని, సచిన్ తనతో చాలా సన్నిహితంగా ఉంటారని.. వీవీఎస్ లక్ష్మణ్ సహా ఈ 27సంవత్సరాల్లో టీమిండియాకు ఆడిన అందరూ తనతో బాగా మాట్లాడతారని ఆయన చెప్పుకొచ్చారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తనను ఎక్కడున్నా గుర్తిస్తారని.. చూసిన వెంటనే తన దగ్గరకు రమ్మని పిలుస్తారని.. ఆయనకు సంబంధించిన వస్తువులకు చాలా సార్లు రిపేర్లు చేశానని అన్నారు. అంతేకాదు మిగిలిన దేశాల క్రికెటర్లైన గిల్‌క్రిస్ట్, క్రిస్ గేల్, షేన్ వార్నే, డేవిడ్ వార్నర్ అందరూ తనను బాగా పలకరిస్తారని భాస్కరన్ తెలిపారు. తానెప్పుడు డబ్బు గురించి ఆలోచించలేదని.. కేవలం వృత్తి తృప్తిని మాత్రమే పొందుతానని ఆయన వెల్లడించారు. ఇక తన కుటుంబంలో ఎవరూ ఈ వృత్తిలోకి రాలేదని అన్నారు. అయితే ఇంత ఉన్నా.. ఏ క్రికెటర్ తనకు సొంత షాప్ పెట్టుకునేందుకు సహాయం చేయలేదని.. అదొక్కటి కొంచెం బాధగా ఉందని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఏ క్రికెటర్ అయినా ఈయనకు సాయం చేస్తారేమో చూడాలి.

Read This Story Also: నా కుటుంబ సభ్యులు ఫీల్ అవుతున్నారు.. అనుష్క ఆవేదన..!