మరో రెండు రోజుల్లో నైరుతి.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..

మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో బలపడనుందని విపత్తుల శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 4 రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని […]

మరో రెండు రోజుల్లో నైరుతి.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2020 | 8:03 PM

మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో బలపడనుందని విపత్తుల శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 4 రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగాన్ని, అధికారులను విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది. జూన్‌ 9న కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులుపడే అవకాశం ఉందని తెలిపింది. జూన్‌ 10, 11, 12 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Also Read: కరోనాపై విజయం.. యాక్టివ్ కేసులు లేని దేశంగా..