Breaking News
  • తెలంగాణ లో 9 సెంటీమీటర్ల పైగా వర్షపాతం. అత్యధికంగా కొమురం భీం జిల్లా బెజ్జూర్ లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం. కొమురం భీం జిల్లా పెంచికల్పేట్ లో 8.4 సెంటీమీటర్లు. నాగర్కర్నూల్, కరీంనగర్, ములుగు, జనగాం జిల్లాలో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్లు. వరంగల్ అర్బన్, రూరల్, సిద్దిపేట్ ,భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలో 3 సెంటీమీటర్లు. నగరంలో లో చార్మినార్ ,ఆసిఫ్ నగర్, బహుదూర్ పుర , సరూర్ నగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్,నాంపల్లి ఏరియాల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం.
  • విజయవాడ: రమేష్ హాస్పిటల్ ఎం.డి వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసిపి సూర్యచంద్రరావు . రమేష్ హాస్పిటల్ ఎం.డి రమేష్ బాబు ఇంకా పరారీ లోనే ఉన్నాడు. ఇల్లు, ఆఫీసు లో సోదాలు నిర్వహించాం. రమేష్ బాబు పోలీసుల ముందుకు వచ్చి ఎలాంటి అనుమతి తీసుకున్నారో చూపిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తాం. సాక్షులు అందరినీ విచారిస్తున్న ముద్దాయిల కోసం గాలిస్తున్నాం. స్వర్ణ ప్యాలెస్ లో ఉన్నది రమేష్ హాస్పిటల్ పేషెంట్స్ కాబట్టి రమేష్ హాస్పిటల్ మాత్రమే దీనికి బాధ్యత వహించాలి. డాక్టర్ మమతా దగ్గర కూడా మాకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకున్నాం
  • టుగెద‌ర్ యాజ్ ఒన్ పాట‌ను ట్వీట్ చేసిన చ‌ర‌ణ్‌. మంచి కాజ్ కోసం ఈ పాట అంటూ ట్వీట్ చేసిన రామ్‌చ‌ర‌ణ్‌. 65 మంది క‌లిసి పాడిన పాట అని ట్వీట్ చేసిన చ‌ర‌ణ్‌. 65 మంది గాయ‌కులు, ఐదు భాష‌ల్లో పాడిన పాట.
  • ఏఎస్సై రామకృష్ణ ఆత్మహత్య ప్రయత్నం. అధికారుల వేధింపులు తాళలేక సూసైడ్ అటెంప్ట్. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య ప్రయత్నం. స్థానిక జోడిమెట్ల లోని క్యూర్ వెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏ ఎస్ ఐ రామకృష్ణ.
  • స్వర్ణ పేలస్ ఫైర్ యాక్సిడెంట్ అగ్నిప్రమాదం పై ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చెసిన హీరో రామ్. రమేశ్ హాస్పిటల్ ఎండీ రమేశ్ కు అన్న కొడుకు హీరో రామ్. పెద్ద కుట్ర జరుగుతోంది.. సీఎం జగన్ ని తప్పుగా చూపించడానికి మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలీకుండా చేసే పనులు వాళ్ళమీ రివ్యూటేషన కి మీ మీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ జరుగుతోంది. స్వర్ణ పేలస్ ని రమేష్ ఆసుపత్రి కోవిడ్ హాస్పిటల్ గా తీసుకోకముందే దాన్ని ప్రభుత్వం కోవిడ్ సెంటర్ గా వినియోగించింది. అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటే ఎవర్నీ నిందించేవాళ్ళు..హీరో రామ్.
  • రాఘ‌వేంద్ర‌రావు : కేసీఆర్‌గారి స్ఫూర్తితో ఎంపీ సంతోష్‌కుమార్‌గారు త‌ల‌పెట్టిన ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలి. మ‌ట్టి వినాయ‌కుడిని పూజిద్దాం. ప్ర‌కృతిని కాపాడుకుందాం. వినాయ‌కుడు అంటే మ‌న విఘ్నాల‌ను తొల‌గించేవాడు. అందుకే ద‌య‌చేసి పూజ పూర్త‌యిన త‌ర్వాత ఎవ‌రూ వినాయ‌కుడిని నిమ‌జ్జ‌నం చేయొద్దు. ఒక తొట్టిలో వేసి నీరుపోయండి. ఆ మట్టిలో మొక్క పెరుగుతుంది.
  • చెన్నై : ఎడిఎంకే లో ఆధిపత్య పోరుపై కీలక ప్రకటన. సీఎం పలనీస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం లతో రెండు గంటలపాటు ఎడిఎంకే ముఖ్య నేతల సమావేశం. రానున్న ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా పనిచేసి విజయం సాధిద్దాం. ఎంజీఆర్, జయలలిత విజయవంతం గా నడిపిన పార్టీని, ఏ కుటుంభం చేతికి వెళ్ళకుండా కాపాడుకోవాలి. పార్టీ చీఫ్ ఎవరన్న అంశం పై పార్టీ నేతలు ఎక్కడా ప్రస్తావించకూడదు.

గుజరాత్‌ తీర ప్రాంతంలో డ్రగ్స్‌ కలకలం

గుజరాత్‌ తీర ప్రాంతంలో డ్రగ్స్‌ ప్యాకెట్లు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా కచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చరస్ (డ్రగ్స్‌లోని ఓ రకం) ప్యాకెట్లు విపరీతంగా దొరుకుతున్నాయి. ఓ విభాగం నుంచి పక్కా..
Coast Guard seizes charas worth Rs Thirty Six lakh in Gujarat, గుజరాత్‌ తీర ప్రాంతంలో డ్రగ్స్‌ కలకలం

గుజరాత్‌ తీర ప్రాంతంలో డ్రగ్స్‌ ప్యాకెట్లు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా కచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చరస్ (డ్రగ్స్‌లోని ఓ రకం) ప్యాకెట్లు విపరీతంగా దొరుకుతున్నాయి. ఓ విభాగం నుంచి పక్కా సమాచారం అందడంతో.. తీర ప్రాతంలో పోలీసులు, కోస్ట్‌ గార్డులు పెట్రోలింగ్‌ చేపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు కచ్ తీర ప్రాంతంలో 24 చరస్ ప్యాకెట్లను కోస్ట్‌గార్డ్స్‌ గుర్తించారు. మార్కెట్‌లో వీటి విలువ రూ.36 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. కచ్ ప్రాంతంలోని జఖౌ పోర్ట్ సమీపంలోని కడియారి ద్వీప ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసిందని డిఫెన్స్‌ వింగ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదిలావుంటే.. మే 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 88 చరస్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కోస్టల్‌ ఏరియా అధికారులు వెల్లడించారు. వీటి విలువ రూ.1.32 కోట్లు ఉంటుందన్నారు. అయితే ఈ ప్యాకెట్లు పట్టుబడ్డ ప్రాంతంలో డ్రగ్ స్మగ్లర్లు సంచరిస్తున్నారని.. ఇది జనావాసాలు లేని ప్రాంతమని తెలిపారు. వీటిని సప్లే చేసే ముఠా కోసం గాలింపు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.

Related Tags