కోల్‌ఇండియాలో కొలువుల జాతర… 9000 ఉద్యోగాలు భర్తీ!

Coal India to fill 9000 executive and non-executive vacancies soon, కోల్‌ఇండియాలో కొలువుల జాతర… 9000 ఉద్యోగాలు భర్తీ!

కోల్‌ఇండియాలో త్వరలో కొలువుల సందడి ప్రారంభం కానుంది. సమీప భవిష్యత్తులో కోల్ ఇండియా లిమిటెడ్ 9000 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనుందని ఎనామిక్ టైమ్స్ తెలిపింది. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలు, అంతర్గత నియామకాల ద్వారా ఈ పోస్టులను పోస్టులను భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొంది. గడచిన దశాబ్దకాలంలో ఇదే అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్ అని.. కోల్ ఇండియా పరిధిలోని 8 సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఎనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

ఎగ్జిక్యూటివ్ పోస్టులను సంస్థ భర్తీ చేయనుండగా.. కార్మికులు, టెక్నికల్ ఉద్యోగాల భర్తీని సబ్సిడరీ కంపెనీలు చేపడతాయి. ఈ డ్రైవ్ ద్వారా చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఖాళీల భర్తీ కోసం కోల్ ఇండియా ఎక్కువ సంఖ్యలో ఎగ్జిక్యూటివ్‌లను నియమించనుంది.

కోల్ ఇండియా గతేడాది 1200 ఉద్యోగ నియామాకాలు చేపట్టగా.. ఈ ఏడాది 9 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 4000 ఖాళీలు ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 900 పోస్టులను ప్రకటనలు, ఇంటర్వూ ద్వారా, 2200 పోస్టులను పోటీ పరీక్షల ద్వారా, 400 పోస్టులను క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా, మిగతా పోస్టులను వేర్వేరు విధానాల్లో భర్తీ చేయనున్నారు.

ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల విషయానికొస్తే.. వీటిలో ప్రధానంగా కార్మికులు, టెక్నికల్ పోస్టులు కలిపి మొత్తం 5000 ఖాళీలను సంస్థ నిబంధనల ప్రకారం భర్తీ చేయనున్నారు. వీటిలో 2300 పోస్టులను కోల్ ఇండియా ప్రాజెక్టుల కారణంగా భూమిని కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల్లోని వ్యక్తులతో భర్తీ చేయనున్నారు. ఇక 2350 పోస్టులకు కారుణ్య నియామకాలు చేపట్టనున్నారు.

భారత్‌లో రైల్వేల తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న పబ్లిక్ సెక్టర్ సంస్థగా ‘కోల్ ఇండియా’ నిలిచిందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. కోల్ ఇండియాలో మొత్తం 2,80,00 మంది ఉద్యోగలు పనిచేస్తుండగా.. వీరిలో 18,000 మంది ఎగ్జిక్యూటివ్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *