‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’.. వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా రూ. 24 వేలు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు.

'వైఎస్ఆర్ నేతన్న నేస్తం'.. వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా రూ. 24 వేలు..
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 12:16 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న నేత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోన్న ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ రెండో విడత కార్యక్రమాన్ని నేడు (శనివారం) సీఎం వైఎస్‌ జగన్ ప్రారంభించనున్నారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేలు నగదు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయనున్నారు.

కోవిద్-19‌ మహమ్మారి కారణంగా లబ్ది దారులకు 6 నెలలు ముందుగానే ప్రభుత్వం సాయం అందించనుంది. ఈ పథకం ద్వారా మొత్తం 81024 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. మొత్తం 194.46 కోట్లు పంపిణీ జరగనుంది.దశాబ్దాలుగా చేనేతలు అనుభవిస్తున్న కష్టాలను పాదయాత్రలో ‌ గమనించిన వైఎస్‌ జగన్, ఆనాడే చేనేతలకు భరోసా ఇచ్చారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాటను వైఎస్‌‌ జగన్‌ నిలబెట్టుకున్నారు.