మరో కార్యక్రమానికి జగన్ శ్రీకారం.. వైఎస్ ఆపిన చోటు నుంచే

YS Jagan likely to start Rachabanda, మరో కార్యక్రమానికి జగన్ శ్రీకారం.. వైఎస్ ఆపిన చోటు నుంచే

తండ్రి వైఎస్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తోన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాజశేఖర్ రెడ్డి తరహాలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. వచ్చే నెల 2వ తేదీ నుంచి జగన్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి అప్పటి సీఎం వైఎస్సార్ ఏర్పాటు చేసిన కార్యక్రమమే రచ్చబండ. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాకు బయల్దేరిన వైఎస్.. హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. వాతావరణం అనుకూలించకపోవడంతో కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లమల అడవుల్లో వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఆ కార్యక్రమం అక్కడే అర్ధాంతరంగా ఆగిపోగా.. ఇప్పుడు రచ్చబండను జగన్ పున: ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

ఇక సీఎం జగన్ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 13 జిల్లాల్లో పర్యటించడానికి అవసరమైన షెడ్యూల్ ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు అన్నిజిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు సమాచారం ఇప్పటికే అందింది. ఈ కార్యక్రమంలో తన పరిపాలన, గ్రామ వాలంటీర్ల పనితీరు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాల్ని సేకరించడంతో పాటు పాలనా విధానాలను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన సూచనలు, సలహాలు సైతం స్వీకరించడానికి సీఎం సిద్ధమవుతున్నారు.సెప్టెంబర్ 2 వైఎస్ జయంతి రోజునే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జగన్ అనుకున్నా.. కొన్ని పరిస్థితుల వల్ల అది కాస్త కుదరలేదు. దీంతో గాంధీ జయంతి(అక్టోబర్ 2) నుంచి జగన్ రచ్చబండను ప్రారంభించాలనుకుంటున్నారు. కాగా అధికారంలోకి వచ్చి దాదాపుగా నాలుగు నెలలను పూర్తి చేసుకున్న జగన్.. అందులో ఎక్కువ భాగం సచివాలయానికి పరిమితమయ్యారు. అన్ని శాఖలు, విభాగ అధిపతులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి క్షణం కూడా తీరిక లేకుండా గడిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *