ఏపీ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌…! 8న ఇళ్ల ప‌ట్టాల పంపిణీ

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు మ‌రో గుడ్ న్యూస్ చెప్పారు. లాక్‌డౌన్ వేళ సీఎం జ‌గ‌న్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 ల‌క్ష‌ల ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు జూన్‌ 7లోగా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

ఏపీ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌...! 8న ఇళ్ల ప‌ట్టాల పంపిణీ
Follow us

|

Updated on: May 05, 2020 | 7:30 PM

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు మ‌రో గుడ్ న్యూస్ చెప్పారు. లాక్‌డౌన్ వేళ సీఎం జ‌గ‌న్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 ల‌క్ష‌ల ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు జూన్‌ 7లోగా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిన సంగ‌తి తెలిసిందే. తొలుత ఈ కార్యక్రమాన్ని ఉగాది రోజున‌ చేపట్టాలని మొదటి నుంచి జగన్‌ సర్కార్ భావించింది. ఐతే అంతలోనే ఎన్నికల ప్రక్రియ మొదలవడం..ఆరువారాలపాటు వాయిదా పడటం, ఆ త‌రువాతి ప‌రిణామాల అనంత‌రం  క‌రోనా లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌టంతో ఇళ్ల ప‌ట్టాల పంపిణీ ప్ర‌క్రియ మూల‌న ప‌డింది. ఇప్పుడు దీనిపై ప్ర‌భుత్వం ఫోక‌స్ పెంచింది. రాష్ట్రంలోని పేదలందరికీ జులై 8న పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ఈలోగా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఇళ్ల ప‌ట్టాల‌కు సంబంధించి రాష్ట్రంలో ఇంకా ల‌బ్ధిదారులు మిగిలిపోయార‌న్న విజ్ఞ‌ప్తులు త‌న‌వ‌ర‌కూ వ‌చ్చిన‌ట్లు జగ‌న్ చెప్పారు. మరో 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గ్రామాల్లోకి వెళ్లి నేను ఆరాతీస్తే.. ఇంటి పట్టా ఎవరికైనా లేదా? అని అడిగితే… లేదు అని ఎవ్వరూ అనకూడద‌ని అన్నారు. “నాకు ఓటు వేయని వారైనా పర్వాలేదు, వాళ్లకీ పట్టాలు ఇవ్వాల్సిందే”న‌ని సీఎం తేల్చిచెప్పారు. ఈ మేర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా 27లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్న‌ట్లు చెప్పారు. జిల్లాలు, మండ‌లాల వారిగా మరోసారి గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు పెట్టి.. అర్హతల వివరాలు పెట్టండి అంటూ అధికారుల‌కు సూచించారు. లిస్ట్‌లో పేరు లేకపోతే ఎవరికి దరఖాస్తు చేయాలో కూడా అక్క‌డే అందుబాటులో వివ‌రంగా ఉంచాల‌ని తెలిపారు.

ఇక‌, మే 6 నుంచి 21 వరకూ జాబితాల ప్రదర్శన, ఆ తర్వాత మరో 15 రోజులు వెరిఫికేషన్ అనంత‌రం తుది జాబితా ఖరారు చేయాల‌న్నారు. జూన్‌ 7లోగా తుది జాబితాను సిద్ధం చేసి ప్ర‌ద‌ర్శించాల‌ని అధికారుల‌కు నిర్దేశించారు. ఈ దరఖాస్తులకు సంబంధించి ఏమైనా కొత్తగా భూములు కొనుగోలు చేయాల్సి వస్తే చేద్దామ‌న్నారు. అర్హ‌త ఉన్న రాష్ట్ర ప్ర‌జ‌లేవ‌రూ త‌మ‌కు అన్యాయం జరిగిందనే మాట అనకూడద‌న్నారు. అర్హత ఉండి కూడా మాకు ఇళ్ల ఇవ్వలేదనే మాట ప్ర‌జ‌ల నుండి రాకూడద‌న్నారు. దేశంలోనే కాని, మరే రాష్ట్రంలోకాని, మన రాష్ట్రంలో కాని ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం జరగలేద‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు.