ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నేటి ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
Follow us

|

Updated on: Sep 03, 2020 | 7:52 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నేటి ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కృష్ణా డెల్టా ఆయకట్టును పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు నిర్మించడం సాధ్యాసాద్యలపై కేబినెట్‌ విస్తృతంగా చర్చించనుంది. అలాగే, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశముంది. రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా వ్యయానికి ఇకపై నగదును రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో కొత్తగా డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారుల నియామకం ప్రక్రియకు ఆమోదం తెలుపనుంది. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకరి చొప్పున 51 డీడీవో పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

అలాగే, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి కేబినెట్ సంతాపం ప్రకటించనుంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు విజృంభిస్తుండడంపై చర్చ జరుగనుంది. రాష్ట్రంలో తీసుకుంటున్న కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వాటాగా రావల్సిన జీఎస్‌టీ పరిహారంపై కేంద్రం కొత్త పల్లవి అందుకోవడంపై రాష్ట్రం అనుసరించాల్సిన వుహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక, గోదావరి ,కృష్ణ వరద ముంపు ప్రాంతాలలో బాధితులకు అందిన పరిహారంపై కేంద్ర సాయం కోరే విషయంపై కేబినెట్‌ చర్చించనున్నట్లు సమాచారం.