ఏపీ ఉద్యోగులకు శుభవార్త!

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. మరో ఏడాది పాటూ వారానికి ఐదు రోజులే పని దినాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27తో గడువు ముగుస్తుండటంతో.. మరో ఏడాది పాటూ ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల అధిపతుల ఆఫీసుల్లోని ఉద్యోగులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం, వివిధ శాఖల అధిపతుల […]

ఏపీ ఉద్యోగులకు శుభవార్త!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 26, 2019 | 3:00 PM

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. మరో ఏడాది పాటూ వారానికి ఐదు రోజులే పని దినాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27తో గడువు ముగుస్తుండటంతో.. మరో ఏడాది పాటూ ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల అధిపతుల ఆఫీసుల్లోని ఉద్యోగులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం, వివిధ శాఖల అధిపతుల ఆఫీసుల్లో పనిచేసే ఏపీ ఉద్యోగులు ఎక్కువమంది హైదరాబాద్‌లోనే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కొందరు ఉద్యోగుల పిల్లల చదువులకు ఇబ్బందిగా మారడంతో.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వారంలో ఐదు రోజులే పని దినాలుగా నిర్ణయించారు. ఆ గడువు ఈ నెల 27తో ముగియనుంది. దీంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.