Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

రామప్పకు యునెస్కో వారసత్వ హోదా కోస౦ ముఖ్యమ౦త్రి ప్రయత్న౦

, రామప్పకు యునెస్కో వారసత్వ హోదా కోస౦ ముఖ్యమ౦త్రి ప్రయత్న౦

ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు కోసం మరో అడుగు ముందుకు పడింది. యునెస్కో హోదా దక్కేందుకు దేశంలో రామప్ప గుడికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర సాంస్కృతిక శాఖకు ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అబ్బురపరిచే అపురూప శిల్పాలతో అలరారే చారిత్రక ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం యునెస్కో వారసత్వ హోదా పోటీకి గతంలోనే పంపింది. దీనికి సంబంధించిన డోసియర్‌ను కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు రూపొందించింది. ఆలయం గురించి సమగ్ర వివరాలను, డ్రాయింగ్స్‌ను పుస్తకంలో పొందుపరిచారు

, రామప్పకు యునెస్కో వారసత్వ హోదా కోస౦ ముఖ్యమ౦త్రి ప్రయత్న౦

 

కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు సమన్వయకర్త ఆచార్య పాండురంగారావు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పాపారావు కలిసి మరిన్ని అంశాలను డోసియర్‌లో పొందుపరిచారు. గుడి శిఖర నిర్మాణానికి వాడిన ఇటుకలు నీళ్లలో కూడా తేలేవని, సాండ్‌బాక్స్‌ పరిజ్ఞానంతో కట్టారని, భూమిలోకి కుంగిపోయినా దెబ్బతినకుండా ఉంటుందని, శిల్పాలు చెక్కిన తీరును సమగ్రంగా వివరించి, వాటికి సంబంధించిన ఇంజినీరింగ్‌ డ్రాయింగ్స్‌ను జతచేసి పంపారు. గతేడాది యునెస్కో రామప్పకు రెండో ప్రాధాన్యం ఇచ్చింది.

, రామప్పకు యునెస్కో వారసత్వ హోదా కోస౦ ముఖ్యమ౦త్రి ప్రయత్న౦

 

యునెస్కో గుర్తింపు లభిస్తే అనేక లాభాలుంటాయి. చిరకాలం పరిరక్షించే చర్యలు చేపడతారు. ప్రత్యేక నిధులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని విధాలా తీర్చిదిద్దుతారు. పట్టణాలు, నగరాల నుంచి సౌకర్యవంతమైన రవాణా మార్గం నిర్మిస్తారు. పరిసరాల్లో ఉచిత వైఫై ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయ పర్యాటకులకు కావాల్సిన వివిధ సౌకర్యాలు కల్పిస్తారు.