ఈ నెల 12న కర్ణాటక కేబినెట్‌ విస్తరణ

కేబినెట్‌ విస్తరణకు కర్ణాటక సీఎం కుమారస్వామి రెడీ అయ్యారు. ఈనెల 12న కేబినెట్‌ను విస్తరించనున్నట్లు ఆయన స్వయంగా మీడియాకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తరువాత రెండు పార్టీల సఖ్యత లోపించింది. జేడీఎస్, కాంగ్రెస్‌ల మధ్య సాగుతున్న అంతర్గత పోరు కూడా ఈ విస్తరణతో ఆగుతుందని ఇరు పార్టీలు  భావిస్తున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ వాజూభాయ్‌ వాలాతో భేటీ అయిన తరువాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సీఎం కుమారస్వామి చెప్పారు. 12వ తేదీన ఉదయం 11.30గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తరవాత ఇరు పార్టీల మధ్య గొడవలు తారస్థాయికి చేరినా.. స్థానిక ఎన్నికల ఫలితాల తరవాత పార్టీ సీనియర్‌ నేతల్లో కాస్త ధైర్యం పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *