రేపు ఆరో విడత హరితహారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం

నర్సాపూర్ లో రేపు సీఎం కెసిఆర్ ప్రారంభించనున్న హరితహారం ఏర్పాట్లను మంత్రులు ఇంద్రకరన్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యే మదన్ రెడ్డి పరిశీలించారు. నర్సాపూర్ అర్భన్ పార్క్ లో సీఎం మొదటి మొక్కను నాటి హరితహారాన్ని ప్రారంభిస్తారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.

రేపు ఆరో విడత హరితహారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2020 | 5:07 PM

అంతరించిపోతున్న అడవులను పరిరక్షించేందుకు రాష్ట్రంలో చేపట్టిన హరితహారం సత్ఫలితాలు ఇస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా సమయంలో ఈ కార్యక్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని నిరాడంభరంగా నిర్వహిస్తున్నామన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ గురువారం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భౌతిక దూరం పాటిస్తూ తక్కువ మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

నర్సాపూర్ లో రేపు ప్రారంభించనున్న హరితహారం ఏర్పాట్లను మంత్రులు ఇంద్రకరన్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యే మదన్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నర్సాపూర్ అర్భన్ పార్క్ లో మొదటి మొక్కను నాటి హరితహారాన్ని ప్రారంభిస్తారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. హరితహారం కార్యక్రమంలో జనాలు గుమిగూడొద్దని, ఆరు అడగుల భౌతికదూరం తప్పనిసరిగా పాటించేలా చర్యల చేపట్టామన్న మంత్రి.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణాలో హరితహారం ద్వారా కోట్లాది మొక్కల్ని నాటుతున్నామన్నారు.