నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు బయల్దేరనున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యరాజధానిగా చేయడానికి జరుగుతున్న పనులను పరిశీలించి దిశా నిర్ధేశం చేయనున్నారు. రెండు వేల కోట్ల రూపాయల ప్రాథమిక అంచనా వ్యయంతో ప్రారంభించిన నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రూ. 800 కోట్ల వరకు ఖర్చుచేసి.. విస్తరణ పునర్నిర్మాణ పనులలో శిల్పి పనులు 95 శాతం పూర్తి చేశారు. పనుల్లో పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు సీఎం వస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. […]

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 12:14 AM

సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు బయల్దేరనున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యరాజధానిగా చేయడానికి జరుగుతున్న పనులను పరిశీలించి దిశా నిర్ధేశం చేయనున్నారు. రెండు వేల కోట్ల రూపాయల ప్రాథమిక అంచనా వ్యయంతో ప్రారంభించిన నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రూ. 800 కోట్ల వరకు ఖర్చుచేసి.. విస్తరణ పునర్నిర్మాణ పనులలో శిల్పి పనులు 95 శాతం పూర్తి చేశారు. పనుల్లో పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు సీఎం వస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా నాయకులు చర్యలు తీసుకోవాలని.. నేతలెవరూ కొండపైకి రావద్దని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు ఇప్పటికే అందాయి. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదాద్రికి వెళ్లనున్నారు.