ఫ్రంట్ ఏర్పాటుపై మరో అడుగు..! స్టాలిన్‌తో భేటీ..!

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ చెన్నైలో డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో భేటీ అవుతున్నారు. ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబసభ్యులు, ఎంపీలు వినోద్ కుమార్, కేశవరావు, సంతోష్ కుమార్ కూడా ఆయన వెంట ఉన్నారు. రాష్ట్రాల అధికారాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపై స్టాలిన్‌తో కేసీఆర్ చర్చలు జరపనున్నారు. ఈ భేటీ అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. ఇవాళ ఉదయం శ్రీరంగం, తిరుచ్చిలోని ఆలయాలను సందర్శించారు కేసీఆర్. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు కేవలం […]

ఫ్రంట్ ఏర్పాటుపై మరో అడుగు..! స్టాలిన్‌తో భేటీ..!
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 1:30 PM

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ చెన్నైలో డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో భేటీ అవుతున్నారు. ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబసభ్యులు, ఎంపీలు వినోద్ కుమార్, కేశవరావు, సంతోష్ కుమార్ కూడా ఆయన వెంట ఉన్నారు. రాష్ట్రాల అధికారాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపై స్టాలిన్‌తో కేసీఆర్ చర్చలు జరపనున్నారు. ఈ భేటీ అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. ఇవాళ ఉదయం శ్రీరంగం, తిరుచ్చిలోని ఆలయాలను సందర్శించారు కేసీఆర్.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో కేసీఆర్-స్టాలిన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. డీఎంకే ఓ వైపు కాంగ్రెస్‌కు మద్దతిస్తూనే కేసీఆర్ ప్రయత్నాలను కూడా ఆహ్వానిస్తోంది.