కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్‌

తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది. ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్రంలో ఆదాయం పడిపోయిందని తెలిపింది. ఇక అన్ని శాఖలు కఠినమైన ఆర్థిక నియంత్రణ పాటించాలన్న సీఎం సూచించారు. ఏ శాఖకు కూడా అదనంగా ఒక్క రూపాయి కూడా కేటాయించొద్దని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సరైన ఆర్థిక క్రమశిక్షణతోనే.. ఈ ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోగలమన్నారు. అంతేకాదు.. నిధుల వినియోగంలో కూడా నియంత్రణ పాటించాలని అధికారులకు […]

కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్‌
Follow us

| Edited By:

Updated on: Dec 12, 2019 | 9:25 AM

తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది. ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్రంలో ఆదాయం పడిపోయిందని తెలిపింది. ఇక అన్ని శాఖలు కఠినమైన ఆర్థిక నియంత్రణ పాటించాలన్న సీఎం సూచించారు. ఏ శాఖకు కూడా అదనంగా ఒక్క రూపాయి కూడా కేటాయించొద్దని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సరైన ఆర్థిక క్రమశిక్షణతోనే.. ఈ ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోగలమన్నారు. అంతేకాదు.. నిధుల వినియోగంలో కూడా నియంత్రణ పాటించాలని అధికారులకు సూచించారు. ఇక 320మెగావాట్ల సామర్థ్యంతో.. దుమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజీని నిర్మించాలని.. ఈ బ్యారేజ్‌ నిర్మాణానికి రూ.3,482 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దీనికి అయ్యే ఖర్చును రెండేళ్లలో బడ్జెట్‌లో కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు..మిడ్‌ మానేరుకు నీటి తరలింపునకు నిర్మాణాలు చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది.

30రోజుల ప్రణాళికా కార్యక్రమం, పల్లె ప్రగతిపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. దీనిపై అధికారులు అలసత్వం వహించారంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే అంశంపై పంచాయతీరాజ్ కార్యదర్శిని ప్రశ్నించారు. వచ్చేనెల జనవరిలో 10 రోజులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..