నూతన సెక్రటేరియట్ డిజైన్లలో సీఎం కేసీఆర్ మార్పులు ఇవే

నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. వీటిలో పలు మార్పులను కేసీఆర్ సూచించారు. సెక్రటేరియట్ లో అందరూ...

నూతన సెక్రటేరియట్ డిజైన్లలో సీఎం కేసీఆర్ మార్పులు ఇవే
Follow us

|

Updated on: Jul 29, 2020 | 10:40 PM

నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. వీటిలో పలు మార్పులను కేసీఆర్ సూచించారు. సెక్రటేరియట్ లో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలుండేలా చూడాలని ఆదేశించారు. కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కొత్త సెక్రటేరియట్ లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్స్ కూడా అన్ని సౌకర్యాలతో ఉండాలని అన్నారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండేలా నిర్మాణం ఉండాలని సీఎం సూచించారు.