పీవీ.. మన తెలంగాణ ఠీవి: కేసీఆర్

బహుముఖ ప్రజ్ఞాశాలి… బహుభాషా కోవిదుడు.. అపర చాణిక్యుడు.. రాజకీయ సోపానంలో ముఖ్యమంత్రిగా.. కేంద్రమంత్రిగా.. ప్రధాన మంత్రిగా.. అన్ని పదవులు ఆయన అధిష్టించిన స్థానాలే… ఏ పదవి చేపట్టినా… ఆయనది మునీశ్వర తత్వమే. కర్మయోగిలా తన పని చేసుకుంటూ వెళ్లడమే ఆయన నైజం. సామర్ధ్యం ,నిజాయితీ ,చిత్తశుద్ధి, వినయం, వివేకం,పోరాట పథం…ఇవన్నీ ఒక్కచోట కుప్పగా పేర్చితే అదే పీవీ నరసింహారావు. తెలంగాణ నుంచి అత్యున్నత స్థాయి పదవికి ఎదిగిన పీవీ నర్సింహారావు దేశాభివృద్ధికి విశేష కృషి చేశారు. సంక్షోభ […]

పీవీ.. మన తెలంగాణ ఠీవి: కేసీఆర్
Follow us

|

Updated on: Jun 28, 2020 | 12:28 PM

బహుముఖ ప్రజ్ఞాశాలి… బహుభాషా కోవిదుడు.. అపర చాణిక్యుడు.. రాజకీయ సోపానంలో ముఖ్యమంత్రిగా.. కేంద్రమంత్రిగా.. ప్రధాన మంత్రిగా.. అన్ని పదవులు ఆయన అధిష్టించిన స్థానాలే… ఏ పదవి చేపట్టినా… ఆయనది మునీశ్వర తత్వమే. కర్మయోగిలా తన పని చేసుకుంటూ వెళ్లడమే ఆయన నైజం. సామర్ధ్యం ,నిజాయితీ ,చిత్తశుద్ధి, వినయం, వివేకం,పోరాట పథం…ఇవన్నీ ఒక్కచోట కుప్పగా పేర్చితే అదే పీవీ నరసింహారావు.

తెలంగాణ నుంచి అత్యున్నత స్థాయి పదవికి ఎదిగిన పీవీ నర్సింహారావు దేశాభివృద్ధికి విశేష కృషి చేశారు. సంక్షోభ సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ దేశాన్ని ముందుండి నడిపారు. తనదైన సంస్కరణలతో దేశ ప్రగతికి బాటలు వేశాడు. ఆయన శత జయంతి వేడుకల్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. పీవీ చిత్రపటానికి ఆయన ఘన నివాళిని అర్పించారు.

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పీవీ సంస్కరణశీలి అంటూ ప్రశంసలు కురిపించారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి రెండు ఉన్న నేత మన పీవీ నరసింహారావు అని అన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవని.. అనేక సంస్కరణలు చేసిన మహోన్నత వ్యక్తి అని సీఎం కితాబు ఇచ్చారు. ఆయన ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారు. విద్యాశాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చింది ఆయనే. ప్రపంచదేశాలకు ఉత్తమ సందేశాన్ని ఇచ్చిన పీవీ నరసింహారావు దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి కూడా గట్టెక్కించారు. ‘మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ప్రజా సేవ చేసిన పీవీకి సరైన గౌరవం లభించలేదు. దీనిపై ఎవరికి భయపడి నేను వెనక్కి తగ్గట్లేదు. ఇది సరైన సమయం కాదు.. సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెబుతా.. ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు పీవీ’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇది చదవండి: కరోనా కరాళనృత్యం.. దేశంలో ఒక్క రోజే 19,906 కేసులు..