ఆ కొందరికి కరోనా రావాల్సిందే… కేసిఆర్ శాపనార్థాలు…

కరోనాపై కొంద‌రు ర‌క‌ర‌కాల‌ విషప్రచారాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ఫైర‌య్యారు. సోషల్ మీడియాలో ప‌నిక‌ట్టుకోని మ‌రీ అస‌త్య ప్రచారాలు చేస్తున్న‌వారికి ఎలాంటి శిక్షలుంటాయో త్వ‌ర‌లోనే చూపిస్తాన‌ని చెప్పారు. అలాంటి దిక్కుమాలిన చిల్లర ప్రచారాలు చేసేవారికి కరోనా సోకాలంటూ సీఎం శాపనార్ధాలు పెట్టారు. ఇలాంటి క్లిష్ట స‌మ‌యాల్లో ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదని పేర్కొన్నారు. క‌రోనా వ‌స్తే బాధ ఏంటో, వారి ఇబ్బందులు ఏంటో..వెద‌వ‌ల‌కు తెలియాల‌ని..ప్ర‌బుద్దుల‌ తాట తీస్తానని సీఎం హెచ్చరించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోని […]

ఆ కొందరికి కరోనా రావాల్సిందే... కేసిఆర్ శాపనార్థాలు...
Follow us

|

Updated on: Mar 29, 2020 | 9:58 PM

కరోనాపై కొంద‌రు ర‌క‌ర‌కాల‌ విషప్రచారాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ఫైర‌య్యారు. సోషల్ మీడియాలో ప‌నిక‌ట్టుకోని మ‌రీ అస‌త్య ప్రచారాలు చేస్తున్న‌వారికి ఎలాంటి శిక్షలుంటాయో త్వ‌ర‌లోనే చూపిస్తాన‌ని చెప్పారు. అలాంటి దిక్కుమాలిన చిల్లర ప్రచారాలు చేసేవారికి కరోనా సోకాలంటూ సీఎం శాపనార్ధాలు పెట్టారు. ఇలాంటి క్లిష్ట స‌మ‌యాల్లో ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదని పేర్కొన్నారు. క‌రోనా వ‌స్తే బాధ ఏంటో, వారి ఇబ్బందులు ఏంటో..వెద‌వ‌ల‌కు తెలియాల‌ని..ప్ర‌బుద్దుల‌ తాట తీస్తానని సీఎం హెచ్చరించారు.

పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోని ప్ర‌జ‌లు సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని సీఎం అభ్య‌ర్థించారు. రైతుల‌కు అన్ని ర‌కాల న్యాయం జ‌రిగేలా తెలంగాణ బిడ్డ‌గా హామి ఇస్తున్నానన్నారు. ఏప్రిల్ 7 త‌ర్వాత రాష్ట్రంలో ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాద‌నే అభిప్రాయాన్ని సీఎం వెల్లిబుచ్చారు. అదును చూసి స‌రుకుల‌ను అధిక రేటుకు అమ్ముతోన్న కంత్రీగాళ్ల‌ను కూడా కొంత‌మందిని అదుపులోకి తీసుకున్నామ‌న్న సీఎం, వారిపై కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీస‌కుంటామ‌ని వెల్ల‌డించారు.