జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు.. సీనియర్‌ అధికారులతో సమావేశం జరిగింది. ఈ కలెక్టర్ల సమావేశంలో.. పలు కీలం అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్‌ వివిధ అంశాలపై అధికారులకు మార్దదర్శకం చేశారు.

జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
Follow us

| Edited By:

Updated on: Jun 16, 2020 | 8:31 PM

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు.. సీనియర్‌ అధికారులతో సమావేశం జరిగింది. ఈ కలెక్టర్ల సమావేశంలో..గ్రామాభివృద్ధి ప్రణాళిక, ఉపాధి హామీ పథకం, హరితహారం, అడవుల పునరుద్ధరణ, పల్లె ప్రగతి, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, రైతుబంధు, రైతువేదికల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ల ఏర్పాటు, కరోనా,అంటువ్యాధులు, మిడతల దండు, నకిలీ విత్తనాలు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. కలెక్టర్లు, సీనియర్ అధికారులు.. వారి వారి అభిప్రాయలను సమావేశంలో ముందుంచారు. అనంతరం సీఎం కేసీఆర్‌ వివిధ అంశాలపై అధికారులకు మార్గదర్శకం చేశారు.

సీఎం కేసీఆర్ చెప్పిన కీలక విషయాలు..

– గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్టే

– ప్లానింగ్ ఆఫ్ టౌన్, ప్లానింగ్ ఆఫ్ విలేజ్ అంటే ప్లానింగ్ ఆఫ్ స్టేట్ అన్నట్లే

– వనరులు, అవసరాలను బేరీజు వేసుకుని గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళిక తయారు కావాలి

– కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా ప్రభుత్వ అధికారాలను.. కలెక్టర్లకు అప్పగింత

-గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా చార్టెడ్డ్ అకౌంట్ నిర్వహించాలి.. అప్పులు క్రమం తప్పకుండా చెల్లించాలి.

– 10 శాతం నిధులు హరితహారానికి కేటాయించాలి.

-గ్రామ స్టాండింగ్ కమిటీల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలి

– ప్రజలతో ఎన్నికైన 1,32,973 మంది గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులున్నారు. 32 మంది జడ్పీ చైర్మన్లు, 539 మంది ఎంపిపిలు, 539 మంది జడ్పీటీసీలు, 5,758 మంది ఎంపీటీసీలు, 12,751 మంది సర్పంచులు, 1,13,354 మంది వార్డు సభ్యులున్నారు.వీరందరినీ భాగస్వాములను చేస్తూ తెలంగాణ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి.

– పల్లె ప్రగతి వల్ల గ్రామాల్లో పరిస్థితి మారింది. ప్రతీ గ్రామానికి ట్రాక్టర్, వైకుంఠ ధామం, నర్సరీ, డంపు యార్డ్‌కు ప్రణాళికలు.. ఇలా దేశంలో ఎక్కడా లేవు.ప్రస్తుతం అన్ని గ్రామాల్లో నర్సరీలు నడుస్తున్నాయి. డంప్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపు కూడా జరిగింది. అన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. రెండు నెలల్లో వైకుంఠ ధామాల నిర్మాణం పూర్తవుతుంది.

– గ్రామాల్లో గుంతలను తొలగించి.. పాడుబడిన బావుల్ని పూడ్చాలి.. నిరుపయోగంగా ఉన్న బోర్లను కూడా పూడ్చాలి

– గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది.

–  కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఉంది. అయినప్పటికీ రైతులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో వెంటనే రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని నిర్ణయం.

-ఏ ఒక్క రైతునూ మినహాయించకుండా అందరికీ రైతుబంధు డబ్బులు

– వర్షాకాలంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేయాలని ప్రభుత్వం పిలుపునిస్తే, రైతులు సంపూర్ణంగా పాటించారు. చెప్పిన ప్రకారం పంటలు సాగు చేస్తున్నారు.

– నకిలీ, కల్తీ విత్తనాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..