ప్రతి ప్రభుత్వ సంస్థ విద్యుత్ బిల్లు కట్టాల్సిందే: కేసీఆర్

విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో విద్యుత్ శాఖ పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. విద్యుత్ సంస్థల లెటర్ ఆఫ్ క్రెడిట్, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రెప్పపాటు సమయం కూడా కరెంట్ పోవద్దని […]

ప్రతి ప్రభుత్వ సంస్థ విద్యుత్ బిల్లు కట్టాల్సిందే: కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2019 | 8:17 AM

విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో విద్యుత్ శాఖ పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. విద్యుత్ సంస్థల లెటర్ ఆఫ్ క్రెడిట్, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

రెప్పపాటు సమయం కూడా కరెంట్ పోవద్దని సూచించారు. విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు పడొద్దనే విధానం తమదని.. విద్యుత్ సంస్థల పనితీరుపైనే రాష్ట్రాభివృద్ధి ఆధారపడి ఉందని చెప్పారు. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్థానిక సంస్థలు ఇకపై ప్రతి నెలా విద్యుత్ బిల్లులు చెల్లించేలా చూస్తామని అన్నారు. అలాగే ప్రభుత్వ విభాగాలు విద్యుత్ బిల్లు చెల్లించేలా కఠిన విధానం అవలంభిస్తామని.. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులపై వేటు తప్పదని కేసీఆర్ హెచ్చరించారు. భారీగా ఉన్న పాత బకాయిలను వన్‌ టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు.

ఇక ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని.. ఆ పథకాలకు విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా కార్యాచరణ ఉండాలని చెప్పుకొచ్చారు. ఇక సమస్యల పరిష్కారానికి గ్రామాలు, పట్టణాల్లో త్వరలోనే విద్యుత్ వారం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉండేదని.. అయితే ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అధికారులు, ఉద్యోగుల శ్రమ, చిత్తశుద్ధి వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..