ఆర్మీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ సూపర్ ఆఫర్

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ చివరి అవకాశం ఇచ్చారు. ఈ నెల 5వ తారీకు లోగా విధుల్లో చేరాలన్నారు. అలా చేసి మీ ఉద్యోగాలు కాపాడుకోండి అంటూ పిలుపునిచ్చారు. అలా చేరితేనే కార్మికులకు భవిష్యత్ ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లపై కమిటీ వేసి చర్చలు జరుపుతున్నామని, కార్మికులు సమ్మెకు వెళ్లడం చట్ట వ్యతిరేకమన్నారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని కోర్టుకు నివేదిక ఇచ్చామని, చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తే కార్మికులు, యజమాన్యానికి సాధారణంగానే సంబంధాలు తెగిపోతాయన్నారు. […]

ఆర్మీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ సూపర్ ఆఫర్
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 10:04 PM

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ చివరి అవకాశం ఇచ్చారు. ఈ నెల 5వ తారీకు లోగా విధుల్లో చేరాలన్నారు. అలా చేసి మీ ఉద్యోగాలు కాపాడుకోండి అంటూ పిలుపునిచ్చారు. అలా చేరితేనే కార్మికులకు భవిష్యత్ ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లపై కమిటీ వేసి చర్చలు జరుపుతున్నామని, కార్మికులు సమ్మెకు వెళ్లడం చట్ట వ్యతిరేకమన్నారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని కోర్టుకు నివేదిక ఇచ్చామని, చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తే కార్మికులు, యజమాన్యానికి సాధారణంగానే సంబంధాలు తెగిపోతాయన్నారు. ఇప్పటికైనా కార్మిక సంఘాల నేతల మాటలు నమ్మకండంటూ హితవు పలికారు. మీ భవిష్యత్‌కు సర్కార్ భరోసా ఇస్తుందన్నారు.

చిన్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి సానుభూతి ఉందన్న సీఎం.. వారికి జీతాలు కూడా పెంచామన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఇకపై కార్మిక సంఘాల నేతలు బ్లాక్ మెయిల్ చేసే అవకాశం లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అంతేకాదు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదన్నారు సీఎం కేసీఆర్.