Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

ఆర్టీసీని నష్టపరిచారు.. వారిని క్షమించేది లేదు: సీఎం కేసీఆర్

CM KCR meeting with Transport minister and officials, ఆర్టీసీని నష్టపరిచారు.. వారిని క్షమించేది లేదు: సీఎం కేసీఆర్

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సీఎ కేసీఆర్ మరోసారి శనివారం అధికారులతో సమీక్షించారు. సమ్మెకు దిగిన ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపేది లేదంటూ మరోసారి తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా మూడు రోజుల్లో వందశాతం బస్సులు రోడ్డెక్కాలని అధికారులను ఆదేశించారు. సమ్మెలో పాల్గొనని సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలను చెల్లించాలని కూడా అధికారులను ఆదేశించారు. మూడు రోజుల్లో బస్సులను పునురుద్ధరించాలని, బస్సులు నడిచే విధంగా తగిన సిబ్బందిని వెంటనే విధులకు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ యూనియన్ల నేతల మాటలు నమ్మి 48 వేలమంది తమ ఉద్యోగాలను కోల్పోయారని, ఇలాంటి వారితో చర్చలకు తావులేదన్నారు. ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టిన వారిని క్షమించలేమన్నారు. చట్టవిరుద్ధంగా సాగిస్తున్న సమ్మెపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఆర్టీసీ యూనియన్లకు మద్దతిస్తున్న పార్టీలను ప్రజలు చీత్కరించుకునే రోజుల దగ్గర్లోనే ఉందన్నారు సీఎం కేసీఆర్.

శనివారం జరిగిన ఈ సమీక్ష సమావేశంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాల్కసుమన్‌, సీనియర్‌ అధికారులు సునీల్‌శర్మ, నర్సింగరావు, సందీప్‌సుల్తానియా, ట్రాన్స్‌పోర్ట్‌ జాయింట్‌ కమిషనర్లు పాండురంగ నాయక్‌, సి.రమేష్‌, మమతాప్రసాద్‌, డీటీసీలు ప్రవీణ్‌రావు, పాపారావు, ఆర్టీసీ ఈడీలు టివిరావు, యాదగిరి, వినోద్‌, వెంకటేశ్వర్లు, రమేష్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

విధ్వంసాలకు పాల్పడితే  పెట్టండి 

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ డిజిపి మహేందర్ రెడ్డి కి ఫోన్ చేశారు. సమ్మె నేపథ్యంలో ప్రతీ ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని చోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేసి , నిఘా పెట్టాలన్నారు. బస్ స్టాండ్ , డిపోల వద్ద మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని సీఎం చూచించారు. ఇంటెలిజెన్స్ పోలీసులను కూడా ఉపయోగించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి,కోర్టుకు పంపాలని ఆదేశించారు. ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదని డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించారు.