రేపు స్వగ్రామానికి వెళ్లనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ రేపు (సోమవారం) తన స్వగ్రామం చింతమడకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌‌రావు మాట్లాడుతూ.. ఈ నెల 22న సీఎం కేసీఆర్‌ తన పురిటి గడ్డ చింతమడక రాబోతున్నారని ఆయన పర్యటనకు సంబంధించి చింతమడకలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు చింతమడక ప్రజలు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా.. చింతమడక ప్రజలతో ఆత్మీయ, సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారని వెల్లడించారు హరీశ్‌రావు. ఈ పర్యటన సందర్భంగా సీఎం తన సన్నిహితులు, స్నేహితులు, ప్రజలతో ఆత్మీయంగా గడపబోతున్నారని తెలిపారు. దీంతో పాటు వారితో కలిసి భోజనం చేస్తారని తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో గత వారం రోజులుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ పర్యటన కేవలం తన గ్రామస్తులను కలుసుకునే పర్యటన మాత్రమే అని తెలిపారు. ఇతర గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఇబ్బంది పడొద్దన్నారు. త్వరలో మరోసారి సిద్దిపేటలో కేసీఆర్ పర్యటించనున్నారని.. అప్పుడు అందరికీ అవకాశం ఉంటుందని చెప్పారు హరీశ్‌రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *