కరోనా సరే.. తెలంగాణకు మిడతలు వస్తే ఏం చేద్దాం!

పాకిస్థాన్‌ నుంచి రాజస్థాన్‌లోకి, అక్కడి నుంచి రోజుల వ్యవధిలో ఒక్కో రాష్ట్రంలోకి ‘వాయు’వేగంతో తరలి వస్తున్న మిడతలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయడంపై రాష్ట్రాలు దృష్టి సారించాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, అనంతపూర్ జిల్లాలకు మిడతల తాకిడి మొదలైంది. ఇటు తెలంగాణకు ఈ మిడతల ద్వారా ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. అధికారులు, వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, […]

కరోనా సరే.. తెలంగాణకు మిడతలు వస్తే ఏం చేద్దాం!
Follow us

|

Updated on: May 28, 2020 | 6:09 PM

పాకిస్థాన్‌ నుంచి రాజస్థాన్‌లోకి, అక్కడి నుంచి రోజుల వ్యవధిలో ఒక్కో రాష్ట్రంలోకి ‘వాయు’వేగంతో తరలి వస్తున్న మిడతలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయడంపై రాష్ట్రాలు దృష్టి సారించాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, అనంతపూర్ జిల్లాలకు మిడతల తాకిడి మొదలైంది. ఇటు తెలంగాణకు ఈ మిడతల ద్వారా ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. అధికారులు, వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. మిడతల దండు అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మిడతల దండు రాష్ట్రానికి వస్తే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నారు..