భారీ వర్షాలపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష!

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాల వారీగా సమాచారం తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి.

భారీ వర్షాలపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష!
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 12:35 PM

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాల వారీగా సమాచారం తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు కూడా భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం (ఈ రోజు) మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, జల వనరుల శాఖ, విద్యుత్, మున్సిపల్, పంచాయితీరాజ్, వ్యవసాయ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటున్నారు.

Read More:

ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు.. 16 సెంటీమీటర్లకు పైగా..!

ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా!