కాళేశ్వరం పంప్‌ హౌస్‌లకు దేవతల పేర్లు! ఏంటో తెలుసా?

CM KCR decides kaleshwaram project barrages with new names

పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామపంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈమేరకు అధికారులు , నిపుణులతో విస్తృతంగా చర్చంచి ముసాయిదా రూపొందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కేసీఆర్‌ ఆదేశించారు.

ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజ్‌లు, పంపుహౌజులకు దేవతల పేర్లను ముఖ్యమంత్రి  ఖరారు చేశారు. మేడిగడ్డ బారాజ్‌కు లక్ష్మీ బారాజ్‌గా నామకరణం చేశారు.
కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు లక్ష్మీ పంప్‌హౌజ్‌
అన్నారం బారాజ్‌కు సరస్వతి బారాజ్‌
సిరిపురం పంప్‌హౌజ్‌కు సరస్వతి పంప్‌హౌజ్‌
సుందిళ్ల బారాజ్‌కు పార్వతి బారాజ్‌
గోలివాడ పంప్‌హౌజ్‌కు పార్వతి పంప్‌హౌజ్‌
నందిమేడారం రిజర్వాయర్‌ కమ్‌ పంప్‌హౌజ్‌కు నంది పేరును ఖరారు చేశారు.
లక్ష్మీపురం పంప్‌హౌజ్‌కు గాయత్రిగా నామకరణం చేశారు. ఇదిలాఉంటే గత ప్రభుత్వాలు రాజకీయ ప్రముఖులు, వ్యక్తుల పేర్లను పెట్టడం ఆనవాయితీ. అయితే కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు కీలక ప్రాజెక్టులకు స్థానిక దేవాలయాల్లో కొలువైన దేవుళ్ల పేర్లను పెట్టే సంప్రదాయానికి తెరలేపారు. ఇందులో భాగంగానే భక్త రామదాసు ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు సైతం స్థానిక పుణ్యక్షేత్రం ఆధారంగానే నామకరణం చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *