ఇంకో ఐదేళ్లు కావాలా?.. యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్ ఫైర్

KCR reviews Sri Lakshmi Narasimha Swamy temple development works, ఇంకో ఐదేళ్లు కావాలా?.. యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్ ఫైర్

యాదాద్రి ఆలయం పునర్ నిర్మాణ పనులను పరిశీలించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణం పనులు, యాదాద్రి అభివృద్ధి పనుల్లో జాప్యం జరగడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేయడానికి మరో ఐదేళ్లు కావాలా ? అంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత తొందరగా పనులను పూర్తి చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం యాదాద్రి ఆలయ నిర్మాణం పనులతో పాటు పట్టణంలోని అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించిన సీఎం కేసీఆర్… పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

ఆలయ అభివృద్ధికి రూ.473 కోట్లతో ప్రతిపాదనలు పంపామని యాదాద్రి అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణ పనుల కోసం తక్షణమే రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు.  మరోవైపు.. యాడాకు మరో ఉన్నతాధికారిని నియమించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్‌ అండ్‌ బీ పనులకు సంబంధించి ఎస్‌ఈ స్థాయి వ్యక్తి పర్యవేక్షిస్తున్నారు. అధికారుల కోరిక మేరకు త్వరలోనే సీఈ స్థాయి వ్యక్తిని ఉన్నతాధికారిగా నియమించనున్నట్లు తెలుస్తోంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *