Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

అమ్మ కేసీఆర్..! విపక్షాలు భలే చిక్కాయే !!

cm kcr divertion tactics, అమ్మ కేసీఆర్..! విపక్షాలు భలే చిక్కాయే !!

తెలంగాణలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ట్రాప్‌లో పడ్డాయా? ఈ ప్రశ్న…తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆర్టీసీ సమ్మెను పరిశీలించిన కొందరు నేతలు ఈ ప్రశ్నను సంధిస్తున్నారు. కేసీఆర్‌ ట్రాప్‌లో ప్రతిపక్షాలు పడ్డాయనేది వీరి డౌట్‌. దానికి చూపించే ఉదాహరణ ఆర్టీసీ సమ్మె.

రెండోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్‌ మరో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కొత్తగా పథకాలేవీ ప్రవేశపెట్టలేదు. పాత స్కీములు కూడా పూర్తిగా అమలు కావడం లేదు. మాంద్యం దెబ్బకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. 57 ఏళ్లకే పెన్షన్, కొత్త డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, నిరుద్యోగ భృతి లాంటి వాటికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు రైతుబంధు పథకం కూడా పూర్తిస్థాయిలో రైతులకు అందడం లేదు. ఐదెకరాలు దాటిన రైతులకు చాలా మందికి ఇప్పటివరకూ అకౌంట్లలో డబ్బులు పడలేదు. ఇలా చాలా సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇలాంటి సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్షాలను సక్సెస్‌పుల్‌గా ఆర్టీసీ బస్సు ఎక్కించారు కేసీఆర్. దాదాపుగా 50 రోజులుగా ప్రతిపక్షాలన్నీ ఆర్టీసీ చుట్టే తిరుగుతున్నాయి. మరి కొన్ని రోజులు కూడా ఆర్టీసీ వివాదం చుట్టే ప్రతిపక్షాలు తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆర్టీసీ ఇష్యూ చుట్టూ ప్రతిపక్షాలను పంపించి..కేసీఆర్‌ మార్క్‌ వ్యూహం అమలు చేశారని రాజకీయ వర్గాలు, పొలిటికల్ ఎనలిస్టులు అంటున్నారు.

రెడీమెడ్‌గా వచ్చిన సమ్మెతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రతిపక్షాలు భావించాయని…కానీ అదే సమయంలో అసలు సమస్యలను వదిలేశామన్న వాస్తవాన్ని గుర్తించలేకపోయాయని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రతిపక్షాలతో పాటు జనం కూడా ఒకే సమస్యపై ఫోకస్‌ పెట్టేలా సీఎం చూశారని.. తన వ్యూహాన్ని అమలు చేయడంలో కేసీఆర్‌ సక్సెస్‌ అయ్యారని అంటున్నారు.

రేపో మాపో ఆర్టీసీ సమ్మె ముగుస్తుంది. ఆతర్వాత అందరూ ఆ సమస్య మరిచి పోతారని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు ముందున్న టైమ్‌లో ప్రతిపక్షాలను రెండు నెలలపాటు ఏ సమస్య వైపు దృష్టి పెట్టకుండా కేసీఆర్‌ చూశారని…ఈ విషయాన్ని పసిగట్ట లేకపోవడం విపక్షాల ఫెయిల్యూర్‌గా కొంతమంది నేతలు విశ్లేషిస్తున్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల టైమ్‌లో కూడా సీపీఐతో పొత్తు అంటూ అటు కమ్యూనిస్టు పార్టీలను కూడా కన్ఫ్యూజ్ చేశారు కేసీఆర్.

మొత్తానికి సక్సెస్ ఫుల్‌గా ప్రతిపక్ష పార్టీలను ఆర్టీసీ సమ్మె బస్సు ఎక్కించి, అసలు సమస్యలు జోలికి రాకుండా కేసీఆర్‌ డైవర్ట్ చేశారని అంటున్నారు. మరి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తిస్తాయో చూడాలి.