కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటాం-సీఎం కేసీఆర్

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటవాసి కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. కల్నల్ సంతోష్ బాబు […]

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటాం-సీఎం కేసీఆర్
Follow us

|

Updated on: Aug 05, 2020 | 4:37 PM

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటవాసి కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. కల్నల్ సంతోష్ బాబు భౌతిక కాయం రిసీవ్ చేసుకోవడం నుంచి అంత్యక్రియల వరకు ప్రతీ కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.