Breaking News
 • డిసెంబర్‌ 9 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం. డిసెంబర్‌ 9న బీఏసీ సమావేశం.
 • అమరావతి: వివిధ శాఖల అధికారులతో సీఎం జగన్‌ సమావేశం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది-జగన్‌. గత ప్రభుత్వం రూ.40వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడంపై దృష్టిపెట్టాం-సీఎం జగన్‌. అనవసర ఖర్చులు తగ్గించడంపై అధికారులు దృష్టిపెట్టాలి. ప్రాధాన్యత అంశాలపై దృష్టిపెట్టి ముందుకెళ్లాలి-సీఎం. నవరత్నాల అమలే ప్రభుత్వానికి ఉన్న ఫోకస్‌-సీఎం జగ.న్‌. కేంద్రం నుంచి వీలైనన్ని నిధులను తెచ్చుకోవాలి. జిల్లాల పర్యటనల్లో నేను ఇచ్చే హమీల అమలు దృష్టిపెట్టాలి-జగన్‌.
 • చిత్తూరు: విద్యాశాఖ పదోన్నతులపై ఆర్‌జేడీ విచారణ. భాషా పండితుల పదోన్నతుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు. అనర్హులకు పదోన్నతులు కల్పించారని కమిషనర్‌కు ఫిర్యాదు. ఉపాధ్యాయుల ఫిర్యాదుతో కొనసాగుతున్న ఆర్‌జేడీ విచారణ.
 • ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు. హైదరాబాద్‌ మార్కెట్లో ఉల్లి ధర రికార్డు. రూ.100కు చేరువలో కిలో ఉల్లిధర. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.97. మూడేళ్ల క్రితం రూ.70 పలికిన కిలో ఉల్లిధర.
 • రాజధానిపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు-లోకేష్‌. రాజధాని విషయంలో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. పార్టీ వీడినవారు చంద్రబాబును ఏమీచేయలేక నాపై విమర్శలు చేస్తున్నారు . రాజధాని భూముల విషయంలో నాపై ఆరోపణలు నిరూపించలేకపోయారు. ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా-నారా లోకేష్.
 • ఛత్తీస్‌గఢ్‌: దంతేవాడ జిల్లాలో పేలిన మందుపాతర. రోడ్డు పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలు. బార్సూర్‌-నారాయణ్‌పూర్‌ మార్గంలో పేలిన మందుపాతర.
 • ఇంగ్లీష్‌ను తామే పరిచయం చేస్తున్నట్టు సీఎం మాట్లాడుతున్నారు. భాషను కూడా రాజకీయాలకు వాడుకుంటున్న పార్టీ వైసీపీ-బోండా ఉమ. ఇంగ్లీష్‌, తెలుగు మీడియంలు ఉండాలని 2016-17లో జీవోలు ఇచ్చాం. 1 నుంచి టెన్త్‌ వరకు ఇంగ్లీష్‌ ఉండాలని జీవో 14 ఇచ్చింది చంద్రబాబే. విద్యావ్యవస్థలో మార్పుపై అసెంబ్లీలో చర్చకు టీడీపీసిద్ధం-బోండా ఉమ. టీడీపీ నుంచి వేరే పార్టీకి వెళ్లడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒకరిద్దరు స్క్రాప్ మాత్రమే టీడీపీ నుంచి వెళ్లిపోయారు-బోండా ఉమ.
 • డిసెంబర్‌ 9 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం. డిసెంబర్‌ 9న బీఏసీ సమావేశం.

నేను ఒక్క సంతకం పెడితే..! ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

CM KCR press meet, నేను ఒక్క సంతకం పెడితే..! ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

హుజూర్‌‌నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. 43,624ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై భారీ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.  భారీ మెజార్టీతో టీఆర్ఎస్‌ను గెలిపించిన హుజూర్‌నగర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్.. ఎల్లుండి హుజూర్‌నగర్‌లో విజయోత్సవ సభను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై ఆయన విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికులు అనవసరమైన పంథా ఎంచుకున్నారన్న ఆయన.. ఇది చిల్లర యూనియన్లు సమ్మె అంటూ విరుచుకుపడ్డారు. రవాణాశాఖపై తనకున్న అవగాహన ఎవరికీ లేదని.. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఆర్టీసీ రూ.13కోట్ల నష్టంలొ ఉండేదని.. ఏడాదిన్నరలోగా రూ.14కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చామని ఆయన అన్నారు. ఇక దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారని చెప్పిన ఆయన దానికి ఉదాహరణలుగా.. పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆర్టీసీని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేయలేదని కూడా ప్రశ్నించారు. అలాగే ఒక్క సంతకం పెడితే 6,7వేల బస్సులు రోడ్లపైకి వస్తాయని.. తక్కువ ధరలకు నడిపేందుకు ప్రైవేట్ బస్సులు సిద్ధంగా ఉన్నాయని చెప్పిన కేసీఆర్.. ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు. ఆర్టీసీ పని అయిపోయిందని పేర్కొన్నారు.

అలాగే తెలంగాణలో దసరా పండుగ చాలా ముఖ్యమని..  డబ్బులు వచ్చే సమయంలో కార్మికులు సమ్మెకు వెళ్లారని.. యూనియన్ల పేరుతో కార్మికుల గొంతు కోశారని అన్నారు. ఆర్టీసీని స్వయంగా వారే ముంచుకుంటున్నారని.. నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడుకునే బాధ్యత కార్మికులపై లేదా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

ఇంకా కేసీఆర్ ఏం మాట్లాడారంటే..

 • ఈ విజయం మా ప్రభుత్వానికి టానిక్‌లాంటిది.
 • ప్రతిపక్షాలు మాపై వ్యక్తిగత విమర్శలు చేశారు. హుజూర్‌నగర్ ప్రజల ఆశలు నెరవేరుస్తాం.ప్రతిపక్షాల పంథా మార్చుకోవాలని కోరా.
 • రాజకీయాల కోసం పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏ అంశాన్ని ఎత్తుకోవాలని ప్రతిపక్షాలకు తెలియదు.
 • బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. కేసీఆర్‌ను తిడితే పెద్దవాళ్లం అవుతామనుకుంటే పొరపాటే.
 • అహంభావం, అహంకారాలు మంచివికావు. ఈ విజయంతో టీఆర్ఎస్ కార్యకర్తలు గర్వపడకూడదు.
 • తెలంగాణ తెచ్చిన పార్టీగా మాపై చాలా బాధ్యతలు ఉన్నాయి.
 • తెలంగాణకు అత్యవసరంగా విద్యుత్, తాగునీరు సమస్యలు తీర్చాం.
 • ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసి సాగు నీరందిస్తాం.
 • అధికారం నిర్ణయించేది ప్రజలు. త్వరలోనే రెవెన్యూ చట్టం తీసుకొస్తాం.
 • త్వరలోనే రెవెన్యూ చట్టం తీసుకొస్తాం. గ్రామ పంచాయితీలకు ప్రతి నెలా రూ.339కోట్లు విడుదల చేస్తాం.
 • హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్. నవంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తాం. నెల రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతాం.
 • ఆర్థిక మాంద్యంతో బడ్జెట్‌ను కుదించుకున్నాం.
 • దేశాన్ని తీవ్ర ఆర్థిక మాంద్యం వేధిస్తోంది.
 • గత ఐదేళ్లుగా మనం 21శాతం వృద్ధితో ఉన్నాం. 2 శాతానికి మన వృద్ధిరేటు పడిపోయింది.
 • 44శాతం ఫిట్‌మెంట్, 15శాతం ఐఆర్ పెంచాం. నాలుగేళ్లలో ఏ రాష్ట్రంలో 67శాతం జీతాలు పెంచలేదు.
 • ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్ధరహితం. రాష్ట్రంలో 57కార్పొరేషన్లు ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మిగతా కార్పొరేషన్లు ఏం చేయాలి.
 • ఆర్టీసీకి రూ.5వేల కోట్ల అప్పులు ఉన్నాయి. పీఎఫ్ సొమ్ము ప్రభుత్వం తీసుకుంటుందా?
 • ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు లాభాల్లో ఉంటాయి. ఆర్టీసీ ఎందుకు నష్టాల్లో ఉంటుంది? అద్దె బస్సుపై లాభాలు వస్తాయి.
 • హైర్ బస్సులపై లాభాలు వస్తాయి. ప్రతి ఆర్టీసీ బస్సుకు కి.మీ. రూ.13 నష్టం వస్తోంది.
 • టీఆర్ఎస్ కంటే ముందు ఐదేళ్లలో రూ.712కోట్లు ఇచ్చారు. టీఆర్ఎస్ వచ్చాక రూ.4,250 కోట్లు ఇచ్చాం.ఈ ఏడాది కూడా రూ.425కోట్లు విడుదల చేశాం.
 • ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వొచ్చని ప్రధాని మోదీ చట్టం తెచ్చారు.సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర చట్టం అమల్లోకి వచ్చింది.
 • యూనియన్లు లేకుండా కార్మికులు పనిచేస్తే లాభాల్లోకి వచ్చేది. రెండేళ్లలోనే బోనస్‌లు తీసుకునే పరిస్థితి వస్తుంది.
 • ప్రభుత్వానిధినేతను అడ్డగోలుగా తిట్టి సమస్యలు పరిష్కరించుకుంటారా..? సీఎంను ఇష్టమొచ్చినట్లు తిడితే సమస్యలు పరిష్కారామవుతాయా..?
 • త్వరలోనే గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తాం.
 • ప్రజాదర్బార్‌లు పెట్టి పోడుభూములు సమస్యలు పరిష్కరిస్తాం.
 • ప్రతి జర్నలిస్ట్‌కు ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత నాది. ఏడాదిలోగా విలేకరులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తా. ఇళ్లు కూడా కట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తా.