Breaking News
  • దీపిక కిడ్నప్ వ్యవహారం లో ట్విస్ట్. టీవీ9 తో రాజశేఖర్, సీఐ వికారాబాద్. దీపిక ఇష్టపూర్వకంగా అఖిల్ తో వెళ్లినట్టు అనుమానిస్తున్నమ్. కిడ్నప్ కు ఉపయోగించింది అఖిల్ కారు కావడంతో ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం ముంబై వైపు వెళ్లినట్టు అనుమనిస్తున్నాం. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. దీపిక కుటుంబ సభ్యులు అఖిల్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐ విట్నెస్ లు మాత్రం బలవంతంగా దీపిక లకెళ్లినట్టు చెబుతున్నారు. అఖిల్ ఫ్రెండ్స్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. త్వరలో నే దీపిక ఆచూకి ని ట్రేస్ ఔట్ చేస్తాం.
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన సోనూ సూద్.... రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోమవారం రామోజీ ఫిలిం సిటీలో జాతీయస్థాయిలో వేలాది మంది వలస కూలీలను ఆదుకున్న ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు, సినీ నటుడు సోనూ సూద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన తాను ఈరోజు మొక్కలు నాటినట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా, తదనంతర కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకరిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సోనూ సూద్ పిలుపునిచ్చారు.
  • చెన్నై: టీటీడీ బోర్డు సభ్యులు శేఖర్ రద్దైన నోట్ల కేసులో.. రెడ్డికి..సీబీఐ కోర్టు క్లీన్ చిట్. నోట్ల రద్దు సమయంలో తన ఇంట్లో ఏసీబీ భారీగా రద్దైన నోట్లు స్వాధీనం చేసుకున్న కేసులో శేఖర్ రెడ్డి పై ఆరోపణలు. ఈ కేసులో సరైన ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైందంటూ న్యాయస్థానం వ్యాఖ్య. పాతనోట్లు, నగదు చెలామణీ నేరంతో సీబీఐ నమోదు చేసిన రెండు కేసులను కొట్టివేస్తూ తీర్పు చెన్నై సీబీఐ కోర్ట్. ఎఫ్ ఐఆర్, చార్జ్ షీట్ ప్రకారం రూ. 247.13 కోట్లు దారిమళ్ళించారు అనే అభియోగం పై విచారణ. శేఖర్ రెడ్డితో పాటు ఈ కేసులో వున్న మరో ఐదు మందికి క్లీన్ చిట్.
  • తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంచూ సందీప్ కు బెయిల్ మంజూరు చేసిన NIA కోర్ట్. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2019 డిసెంబర్ లో అరెస్ట్ అయిన సందీప్. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న సందీప్. ప్రస్తుతం సందీప్ పై ఐదు కేసులు నమోదు చేసిన పోలీసులు. రేపు జైలు నుండి బయటకు రానున్న సందీప్.
  • అమరావతి: ఏపీ హైకోర్టులో సినీ నిర్మాత అశ్వనీదత్ పిటిషన్. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు 39 ఎకరాలు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ కింద అప్పటి ప్రభుత్వానికి ఇచ్చిన ప్రభుత్వం. ల్యాండ్ పూలింగ్ చట్టం కింద హామీ ఇచ్చినట్టుగా రాజధాని అభివృద్ధి జరగడం లేదన్న అశ్వనీదత్. దీంతో భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లించాలని కోరిన అశ్వనీదత్. విచారణకు స్వీకరించిన ధర్మాసనం.
  • చెన్నై : ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన నటుడు కమహాసన్ . ప్రముఖ గాయకుడు ఎస్పీబీ కి భారత రత్న ఇవ్వాలని ప్రధాని కి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్ . ఒక గొప్ప గాయకుడికి , మా అన్నయ కి తప్పకుండ ఈ గౌరవం దక్కాలని , తమిళనాడు లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కోరుకుంటున్నారని వెల్లడి . ఈ విషయం లో ముందడుగు వేసిన ఏపీ సీఎం జగన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
  • తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంచూ సందీప్ కు బెయిల్ మంజూరు చేసిన NIA కోర్ట్. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2019 డిసెంబర్ లో అరెస్ట్ అయిన సందీప్.. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న సందీప్.. ప్రస్తుతం సందీప్ పై ఐదు కేసులు నమోదు చేసిన పోలీసులు. రేపు జైలు నుండి బయటకు రానున్న సందీప్.

మోదీ మరింత కాలం దేశానికి సేవ చేయాలి : సీఎం కేసీఆర్

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున కేసీఆర్ ప్రధానికి బర్త్ డే విషెస్ చెప్పారు.

CM KCR birthday wishes to PM modi, మోదీ మరింత కాలం దేశానికి సేవ చేయాలి : సీఎం కేసీఆర్

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున కేసీఆర్ ప్రధానికి బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రధాని మోదీ రాబోయే మరిన్ని సంవత్సరాలపాటు దేశానికి సేవ చేసే విధంగా ఆశీర్వదించాలని కేసీఆర్ భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు మోదీకి తన సందేశాన్ని పంపించారు కేసీఆర్. అటు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికూడా ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మరింత సేవ చేసేలా ఆయురారోగ్యాలిచ్చి ప్రధానిని ఆ భగవంతుడు ఆశీర్వదిస్తారని జగన్ ఆకాంక్షించారు.
CM KCR birthday wishes to PM modi, మోదీ మరింత కాలం దేశానికి సేవ చేయాలి : సీఎం కేసీఆర్

Related Tags