బోరు బావిలో బాలుడు.. స్పందించిన సీఎం కేసీఆర్

మెదక్ జిల్లా పోడ్చన్‌పల్లిలోని బోరుబావిలో మూడేళ్ల బాలుడు పడ్డ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతిలో బోర్లు అన్నీ మూసేయాలని చెప్పాం.. అయినా ఎందుకు మూసేయలేదని...

బోరు బావిలో బాలుడు.. స్పందించిన సీఎం కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: May 27, 2020 | 8:48 PM

మెదక్ జిల్లా పోడ్చన్‌పల్లిలోని బోరుబావిలో మూడేళ్ల బాలుడు పడ్డ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతిలో బోర్లు అన్నీ మూసేయాలని చెప్పాం.. అయినా ఎందుకు మూసేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. బోరు బావి ఘటనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన పద్మా దేవేందర్ రెడ్డి. కాగా ఇదే ఘటనపై మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు హరీష్ రావు.

కాగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో దారుణం జరిగింది. సాయి వర్థన్ అనే మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడ్డాడు. పంట పొలం కోసం తవ్విన బోరుబావిలో.. సాయి వర్థన్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తూ పడ్డాడు. 120-150 అడుగుల బోరుబావి లోతులో బాలుడు ఉన్నాడు. వెంటనే సహాయక చర్యలు చేపట్టింది రెస్య్యూ టీమ్. అలాగే సంఘటనా స్థలానికి నాలుగు జేసీబీలు చేరుకున్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఎస్పీ చందనా దీప్తి. అలాగే బావిలో ఉన్న బాలుడికి ఆక్సిజన్ అందేలా చర్యలు చేపట్టారు అధికారులు.

Read More:

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!

వాహనదారులకు మరో శుభవార్త.. ఇక వాట్సాప్‌ నుంచి రవాణా శాఖ సేవలు..

కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు