ఏపీలో వందేళ్ల తర్వాత భూముల రీసర్వే..‘’వైఎస్​ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు’ పథకం ప్రారంభించనున్న సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ‘'వైఎస్​ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష' పథకం ప్రారంభంకానుంది. దాదాపు 100 ఏళ్ల

ఏపీలో వందేళ్ల తర్వాత భూముల రీసర్వే..‘'వైఎస్​ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు' పథకం ప్రారంభించనున్న సీఎం జగన్..
Follow us

|

Updated on: Dec 21, 2020 | 5:57 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ‘’వైఎస్​ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష’ పథకం ప్రారంభంకానుంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత భూముల రీసర్వే చేపట్టారు. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో ఈ ఉదయం 10 గంటలకు సీఎం జగన్ లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మూడు దశల్లో సమగ్ర భూ సర్వే చేపట్టి 2023 జనవరి నాటికి రాష్ట్రమంతటా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. తొలి దశ నేటి నుంచి ప్రారంభం కాగాసర్వే పూర్తవగానే రికార్డులను గ్రామ సచివాలయాల్లో పొందుపరుస్తారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి సీఎం జగన్ ఈ పథకానికి శ్రీకారం చుడతారు. అనంతరం జగ్గయ్యపేటలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. ఇప్పటికే సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఇంత భారీ ఎత్తున భూముల రీ సర్వే చేయడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఈ సర్వేలో కొలతలు కచ్చితంగా ఉంటాయని, తేడా చాలా సూక్ష్మస్థాయిలో 2 సెంటీ మీటర్లకు అటూ ఇటూ మాత్రమే ఉంటుందంటున్నారు. గత వందేళ్లుగా నమోదుకాని సబ్‌ డివిజన్లు, పంపకాలనూ రికార్డుల్లోకి ఎక్కిస్తారని పొలాల్లో సరిహద్దు రాళ్లు వేస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక సంఖ్యతో రైతుకు ఒక కార్డు ఇస్తామంటున్నారు. దానిలో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని హార్డ్‌ కాపీ కూడా అందిస్తామంటున్నారు. రికార్డులన్నీ డిజిటల్‌ రూపంలోకి మార్చి గ్రామాలకు సంబంధించిన మ్యాపులూ అందుబాటులోకి తెస్తామంటున్నారు. రాష్ట్రంలోని 14 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని, సర్వే బాధ్యతలన్నీ కలెక్టర్లే దగ్గరుండి చూసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.