పలు శాఖలతో సీఎం జగన్ కీలక సమీక్షలు..

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ పరిపాలనపై దృష్టి పెట్టారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై చర్చించిన ఆయన.. శాఖలవారీగా పలు సమీక్షలు జరపనున్నారు. ఇవాళ ఆర్థిక, రెవెన్యూ శాఖల అధికారులతో భేటీ అవుతున్నారు. జూన్ 3న విద్య, జలవనరుల శాఖ, 4న వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖ, 6న సీఆర్డీఏపై సమీక్షించనున్నారు సీఎం జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *