Breaking News
 • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
 • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
 • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
 • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
 • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
 • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

“నాది కూడా కృష్ణా జిల్లానే, నా మేనత్తను ఈ జిల్లా వారికే ఇచ్చాం”

AP Assembly Live Updates 2020, “నాది కూడా కృష్ణా జిల్లానే, నా మేనత్తను ఈ జిల్లా వారికే ఇచ్చాం”

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇవాళ చారిత్రాత్మకమైన రోజని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. 3 రాజధానుల బిల్లుపై ఆయన శాసనసభలో ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు సభలో అబద్దాలు చెబుతూ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. వెలగపూడిలో ఉన్నది టెంపరరీ బిల్డింగ్స్ అన్న సీఎం, ఆల్రెడీ మద్రాస్‌ని పోగొట్టుకున్నాం, కర్నూలును కూడా వదులుకున్నామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణన్ రాజధాని గురించి మాట్లాడిన క్లిప్పింగులను సభలో ప్లే చేయించారు జగన్.

సీఎం జగన్ మాట్లాడిన స్పీచ్‌లోని ముఖ్యాంశాలు :

 • ఈ సభలో తీసుకునే నిర్ణయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు
 • నన్ను మాట్లాడనీయకుండా చేస్తున్న టీడీపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారు
 • తెలుగువారంతా ఒకటి కావాలి అని ఆరోజు శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకున్నారు
 • శివరామకృష్ణన్ నివేదికలోనే నూతన రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించారు
 • కమిటీ రిపోర్టులను బాబు గడ్డిపరికలా కొట్టిపారేశారు
 • మొదటి తెలంగాణ ఉద్యమం అభివృది రాహిత్యం వల్ల వస్తే.. రెండవ సారి అభివృద్ధి ఒక్కచోట కేంద్రీకృతం కావడం వల్ల వచ్చిందని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది
 • నొటిఫికేషన్ కన్నా ముందే టీడీపీ నేతలు భూములు కొన్నారు
 • బాబు ఏకపక్షంగా చేయాలనుకుంది చేసుకుంటూ వెళ్లిపోయారు
 • అమరావతి అనేది విజయవాడలో లేదు, గుంటూరులో లేదు
 • తన బినామీలకు బాబు భూములు దోచిపెట్టారు
 • భూములు కొన్నవాళ్లలో బాబు సొంత కంపెనీ హెరిటేజ్‌ కూడా ఉంది
 • విజయవాడ, గుంటూరు మధ్య భ్రమరావతి చూపించారు
 • నిర్మాణాలకు అనువుగా లేని గ్రామాల్లో కూడా భూములు కొనుగోలు చేశారు
 • నైన్ ఇన్ వన్ అంటూ కొత్త సినిమా చూపించారు
 • స్టేట్‌ను బాబు రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చుకున్నారు
 • రాజధాని కోసం నారాయణ కమిటీ అని సొంత కమిటీ వేసుకున్నారు
 • అమరావతి భూములకు లక్ష కోట్ల రూపాయల వెల కట్టారు
 • కనీసం రోడ్డు కూడా లేని గ్రామాల్లో కూడా భూములు కొనుగోలు చేశారు
 • చంద్రబాబు ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చారు
 • టీడీపీ నేతలకు రైతులపై ప్రేమ లేదు
 • చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ అమరావతి కట్టాలంటే ఇంకా లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాలి
 • మాది కూడా కృష్ణా జిల్లానే, మా మేనత్తను ఈ జిల్లా వారికే ఇచ్చాం
 • మా కుటుంబానికి చెందిన రాజ్, యువరాజ్ థియేటర్లు..40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాయ్
 • కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 33 మంది ఎమ్మెల్యేలు ఉంటే 29 మంది మావాళ్లే..
 • ఈ జిల్లాలో నివశిస్తోన్న ప్రతివారు నావారే
 • టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు మాకు మద్దతిచ్చేవారు ఉన్నారు
 • ప్రజలను మోసం చెయ్యలేను, అభివృద్ది చేసి చూపిస్తా
 • అన్ని జిల్లాలు, కులాలు, మతాలు ప్రాంతాలు చల్లగా ఉండాలి
 • కమ్మ, కాపు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీలు..అందరూ ఓట్లు వేస్తేనే 151 సీట్లు గెలిచాం
 • నేను గొప్ప సహచరులుగా భావించే కొడాలి నాని, తలశిల రఘురాం కమ్మారు కాదా?
 • నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు, నాకు అలాంటి వ్యత్యాసాలు లేవు

 

Related Tags