Breaking News
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
  • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

రాజధానిపై ప్రజల అభిప్రాయం..జగన్ ఆర్డర్ అదుర్స్..!

Expert Panel Ready To Take Opinion From People Over AP Capital, రాజధానిపై ప్రజల అభిప్రాయం..జగన్ ఆర్డర్ అదుర్స్..!

సీఎం జగన్..ఇఫ్పుడు దేశంలో ఓ సెన్సేషన్‌గా మారారు. అనూహ్య నిర్ణయాలు, అంచనాలు వేయలేని రాజకీయ అడుగులతో దూసుకుపోతున్నారు. ఖజానాలో నిధలు లేకున్నా..సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కి తగ్గకుండా తన పార్క్ పాలన ఏంటో చూపిస్తున్నారు. ఏపీని ఇప్పుడు పరిపాలించడం కత్తి మీద సామే. ఎందుకంటే ఎదురుగా రాజధాని నిర్మాణం ఉంది. అనేక ఆర్థికపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అటువంటి సరిస్థితుల్లో సీఎం జగన్ పాలన చూసి ఇతడు మొదటి టర్మ్ సీఎం అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అంత సమర్థవంతంగా అతని అడుగులు పడుతున్నాయి.

ఇక ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిపుణుల కమిటీని రిపోర్ట్ తర్వాత రాజధానిపై ముందుకు వెళ్తామని..మున్సిపల్ మంత్రి బొత్స ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కమిటీకి కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవల్‌లో లోటుపాట్లను పూర్తిగా అంచనా వేస్తోంది. తాజాగా ఏపీ రాజధానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు రంగం సిద్దమైంది. కొద్ది రోజుల క్రితమే ఈ కమిటీ సమావేశంకాగా.. తాజాగా ప్రజాభిఫ్రాయ సేకరణ ప్రారంభించింది. రాజధాని నిర్మాణం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అభిప్రాయాలు, సూచనలు పంపాలని కోరిన నిపుణుల కమిటీ కోరింది. ఈ మేరకు కొన్ని సూచనలు చేసింది.

రాజధానిపై అభిప్రాయాలు తెలియజేయాలనుకున్నవాళ్లు.. ఈ-మెయిల్ లేదా లేఖల ద్వారా పంపాలని జీఎన్ రావు కమిటీ కోరింది. అభిప్రాయాలను చెప్పదలచుకున్నవారు.. expertcommitee2019@gamail.com అడ్రస్‌కు మెయిల్ చేయొచ్చు. విజయవాడలోని నిపుణుల కమిటీ కార్యాలయానికి లేఖల్ని పోస్టులో పంపాలి. సూచనలు పంపించేందుకు నవంబర్ 12 వరకు గడువుగా నిర్ణయించారు.

 

Related Tags