ఏపీలో ఆశావర్కర్ల వేతనం భారీగా పెంపు

ఏపీ సీఎం జగన్ తన పాదయాాత్రలో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు. ఆశావర్కర్ల వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వైద్యఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు పలు సూచనలు చేశారు. శాఖ పనితీరును మెరుగుపరిచి సమూల ప్రక్షాళన దిశగా దేశంలోనే ఆదర్శవంతమైన విధానాలను అమలు చేయాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.  ఇప్పటివరకు వీరి వేతనం 3 వేలు మాత్రమే ఉండటం గమనార్హం. గత ఏడాది జూన్ వరకు 1200 మాత్రమే ఉన్న వీరి వేతనాన్ని అప్పటి చంద్రబాబు సర్కార్ 3 వేలకు పెంచింది. తాజా నిర్ణయంతో ఆశావర్కర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *