Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు.. సీఎం భారీ సహాయం..!

CM Jagan huge help to the students, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు.. సీఎం భారీ సహాయం..!

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు.. ఏపీ సీఎం జగన్ భారీ సహాయం అందించనున్నారు. వైఎస్ జగన్.. పాదయాత్రలో భాగంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు.. ప్రకటించిన దానికన్నా.. స్కూలు బ్యాగు, నోట్ బుక్స్ అదనంగా ఇవ్వనుంది ప్రభుత్వం.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న పిల్లలకు స్కూల్ బ్యాగు, నోట్‌బుక్స్, టెస్ట్‌ బుక్స్, 3 జతల యూనిఫారమ్స్, జత షూస్, సాక్సులు అందించనుంది. అంతేకాకుండా.. యూనిఫారమ్స్ కుట్టించుకునేందుకు.. అదనంగా డబ్బులు కూడా ఇవ్వనుంది ఏపీ సర్కార్. పాఠశాలలు తెరిచేనాటికి అందించాలని.. అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లల్లో కొత్త ప్రణాళికను తయారు చేయడంపై జగన్ అధికారులతో చర్చ కూడా చేపట్టారు.

వచ్చే ఏడాది 1వ తరగతి నుంచి 6 వరకూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టబోతున్నామని.. దీనికి పిల్లలను సన్నద్ధం చేయాలని చెప్పారు. వారికి ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని అధికారులను సూచించారు సీఎం. విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెలరోజులు పిల్లలకు బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తామని.. సీఎంకు తెలిపారు అధికారులు. అన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

Related Tags