గిరిజ‌నుల‌కు సీఎం జ‌గ‌న్ గుడ్ న్యూస్…ఆ రోజునే పట్టాల పంపిణీ

ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలకు సంబంధించి సీఎం జ‌గ‌న్ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. శుక్రవారం రోజున సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహించిన ఈ మీటింగులో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, అటవీ, గిరిజన సంక్షేమ, రెవిన్యూ, శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

గిరిజ‌నుల‌కు సీఎం జ‌గ‌న్ గుడ్ న్యూస్...ఆ రోజునే పట్టాల పంపిణీ
Follow us

|

Updated on: Jul 10, 2020 | 9:51 PM

ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలకు సంబంధించి సీఎం జ‌గ‌న్ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. శుక్రవారం రోజున సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహించిన ఈ మీటింగులో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, అటవీ, గిరిజన సంక్షేమ, రెవిన్యూ, శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు. అటవీ భూములపై సాగు హక్కుల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న‌ గిరిజనులకు ఆశ‌లు నెర‌వేర్చాల‌న్నారు. అర్హత ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి సాగు హక్కులు కల్పించాలని సూచించారు.

పట్టాలు ఇచ్చాక ఆయా భూముల అభివృద్ధిపై ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్లాల‌న్నారు. ఆ భూముల్లో ఏం సాగు చేస్తే గిరిజ‌నుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌న్న విష‌యంపై కూడా ఒక ప్రణాళిక‌తో ముందుకెళ్లాల‌న్నారు. దీనిపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీని కోసం ‘గిరిభూమి’ పేరుతో పోర్టల్‌ను స్టార్ట్ చేస్తున్న‌ట్లు అధికారులు ముఖ్య‌మంత్రికి తెలిపారు.