‘ఇంద్రా’! ఇదిగో వీణ.. చిరుకు జగన్ గిఫ్ట్..!

ఏపీ సీఎం జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి.. భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వారిని సాదరంగా ఆహ్వానించారు. అలాగే.. చిరు కూడా.. జగన్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జగన్‌ సీఎం అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే మొదటిసారి. అయితే.. తిరిగి జగన్.. కూడా.. చిరుకి చిరు సత్కారం చేశారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:05 pm, Mon, 14 October 19

ఏపీ సీఎం జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి.. భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వారిని సాదరంగా ఆహ్వానించారు. అలాగే.. చిరు కూడా.. జగన్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జగన్‌ సీఎం అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే మొదటిసారి.

అయితే.. తిరిగి జగన్.. కూడా.. చిరుకి చిరు సత్కారం చేశారు. శాలువా కప్పి.. దానితో కూడా.. వీణను బహుకరించారు. వీణ స్టెప్‌తో.. తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని ఊపేశారు చిరు. ఇంద్ర సినిమాలో వేసిన వీణ స్టెప్‌.. చిరుకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. మెగాస్టార్ అనగానే.. ఆ వీణ స్టెప్‌నే గుర్తుకొస్తుంది. ‘దాయి దాయి.. దామ్మ.. కులుకే కుందనాల బొమ్మ’.. సాంగ్‌లో వీణ స్టెప్‌తో అదరగొట్టారు చిరు.