సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన విధి విధానాలు, ప్రాజెక్టులు, ఒప్పందాలను సమీక్షించేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, నీటిపారుదల మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డితోపాటు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మన్మోహన్‌సింగ్‌ ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఉమ్మడి ఏపీ […]

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీ
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 27, 2019 | 8:35 PM

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన విధి విధానాలు, ప్రాజెక్టులు, ఒప్పందాలను సమీక్షించేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, నీటిపారుదల మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డితోపాటు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మన్మోహన్‌సింగ్‌ ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు.

ఉమ్మడి ఏపీ నుంచి ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత టీడపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీలు, ప్రాజెక్టులపై ఈ మంత్రివర్గ ఉపసంఘం సమీక్షిస్తుంది. దాదాపుగా 30 అంశాలపై ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అదే విధంగా గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, అవకతవకలు, అవినీతిపై లోతుగా అధ్యయనం చేయనుంది. ఆరునెలల్లో సమీక్ష పూర్తి చేసి..నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ కమిటీ ఏర్పాటుతో పరిపాలనపరంగా మరో కీలక ముందడుగువేసినట్టు భావిస్తున్నారు.

పాలనలో దూకుడుగా వెళ్తున్న ఏపీ సీఎం జగన్.. గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమీక్షించడం ద్వారా చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని పట్టుదలతో ఉన్నారు.