అవినీతిపై ఆగ్రహం.. జగన్ నెక్స్ట్ స్టెప్ ఇదే

అవినీతిని పూర్తిగా అంతమొందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఏసీబీ అధికారులు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అంతానికి నెల రోజుల గడువిచ్చారు సీఎం. నెలరోజుల్లో మార్పు రాకపోతే ఏం చేస్తానో చూడండంటూ అధికారులపై హూంకరించారు. గురువారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్ ఏసీబీ పనితీరుపై సమీక్ష జరిపారు. ఏసీబీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన సీఎం.. అధికారులకు నెల రోజుల గడువు ఇచ్చారు. ఆశించిన రీతిలో ఏసీబీ అధికారుల […]

అవినీతిపై ఆగ్రహం.. జగన్ నెక్స్ట్ స్టెప్ ఇదే
Follow us

|

Updated on: Jan 02, 2020 | 2:19 PM

అవినీతిని పూర్తిగా అంతమొందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఏసీబీ అధికారులు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అంతానికి నెల రోజుల గడువిచ్చారు సీఎం. నెలరోజుల్లో మార్పు రాకపోతే ఏం చేస్తానో చూడండంటూ అధికారులపై హూంకరించారు.

గురువారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్ ఏసీబీ పనితీరుపై సమీక్ష జరిపారు. ఏసీబీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన సీఎం.. అధికారులకు నెల రోజుల గడువు ఇచ్చారు. ఆశించిన రీతిలో ఏసీబీ అధికారుల పనితీరు కనిపించడంలేదని సీఎం అభిప్రాయపడ్డారు. ఏసీబీలో అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలకంగా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఏసీబీలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదని ఆదేశించారు సీఎం.

అవినీతి నిరోధానికి 14400 కాల్‌సెంటర్‌‌ను ఏర్పాటు చేయడం వెనుక మంచి కారణాలు ఉన్నాయని, కానీ వచ్చిన ఫిర్యాదులను డీల్ చేయడంలో అలసత్వం వద్దని అధికారులను హెచ్చరించారు. ప్రజలెవ్వరూ కూడా అవినీతి బారిన పడకూడదని, లంచాలు చెల్లించే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని సీఎం అన్నారు. ఎమ్మార్వో కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసుల్లో అవినీతి మితిమీరుతోందని, ఆ పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దాలని జగన్ ఆదేశించారు.

లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలని, అందుకోసం సెలవుల్లేకుండా పనిచేయమని ఆయన నిర్దేశించారు. మూడు నెలల్లోగా మార్పు కనిపించాలని, అందుకు అవసరమైన సిబ్బందిని తీసుకోమని ఆయన సూచించారు. ఎలాంటి సదుపాయాలు కావాలన్న ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మరో నెలరోజుల్లో సమీక్ష చేస్తానని సీఎం చెప్పారు.