లోకేష్‌కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన జగన్..

శాసనమండలిలో.. ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల రద్దును సెలెక్ట్‌ కమిటీకి పంపించేలా చేయడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాదు.. మంగళగిరి టీడీపీ ఆఫీసుకు భారీగా రాజధాని రైతులు చేరుకుని అభినందనలు చెబుతున్నారు. ఇవాళ లోకేష్‌ పుట్టినరోజు కూడా కావడంతో పుష్పగుచ్చాలను ఇచ్చి మరీ విషెస్‌ చెబుతున్నారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించడం.. సాధించిన విజయానికి సింబల్‌ అన్నారు. ఈ సందర్భంగా మండలిలో సభ్యుడిగా ఉన్న లోకేశ్‌ను.. టీడీపీ […]

లోకేష్‌కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన జగన్..
Follow us

|

Updated on: Jan 24, 2020 | 10:25 AM

శాసనమండలిలో.. ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల రద్దును సెలెక్ట్‌ కమిటీకి పంపించేలా చేయడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాదు.. మంగళగిరి టీడీపీ ఆఫీసుకు భారీగా రాజధాని రైతులు చేరుకుని అభినందనలు చెబుతున్నారు. ఇవాళ లోకేష్‌ పుట్టినరోజు కూడా కావడంతో పుష్పగుచ్చాలను ఇచ్చి మరీ విషెస్‌ చెబుతున్నారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించడం.. సాధించిన విజయానికి సింబల్‌ అన్నారు. ఈ సందర్భంగా మండలిలో సభ్యుడిగా ఉన్న లోకేశ్‌ను.. టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో హైలెట్ చేస్తోంది.  ఆయనపై స్పెషల్ మీమ్స్ రూపొందించి మరీ సర్కులేట్ చేస్తున్నారు.

అయితే లోకేశ్‌కు ఊహించని షాక్ ఇచ్చారు సీఎం జగన్. ఆయన బర్త్ డే రోజునే మండలి రద్దు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం లోకేశ్ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఎమ్మెల్సీ కోటాలోనే మంత్రి పదవి సాధించారు. 2023 మార్చి 29 వరకు ఆయన పదవీకాలం ఉంది.  ప్రస్తుతం సీఎం ఉన్న దూకుడును బట్టి చూస్తే..ఒక వారంలోపులోనే ఏపీ మండలి రద్దు తీర్మాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత బాల్ పార్లమెంట్ పరిధిలోకి వెళ్తుంది. అక్కడ ఉభయ సభల ఆమోదం అవసరం. దీంత లోకేశ్‌కు సీఎం షాకింగ్ బర్త్ డే గిప్ట్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.