వరద బాధితులకు సీఎం భరోసా

AP CM YS Jagan Mohan Reddy, వరద బాధితులకు సీఎం భరోసా

వరద బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా వరద పరిస్థితిపై నంద్యాలలో జగన్ సమీక్ష నిర్వహించారు. దేవుడు ఆకలి కేకలు ఉండకూడదని వర్షం పుష్కలంగా కురిపించాడని,. మంచి వర్షాలు కురవడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయని సంతోషం వెలిబుచ్చారు. రాయలసీమ ప్రాంతంలో ఈ స్థాయి వర్షాలు అరుదని,  పదేళ్ల తర్వాత ఇంతటి భారీ వర్షాలు కురిసాయని అన్నారు. వర్షాల వల్ల నంద్యాల డివిజన్ లో రూ.784 కోట్ల నష్టం జరిగిందన్నారు. 31వేల హెక్టార్లలో పంటనష్టం, 2వేల హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందన్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన బాధితుల పట్ల అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం జగన్‌ మోహన్‌ సూచించారు.
కర్నూలులో 66 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదు అయ్యిందని, దాదాపు 17 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు… వర్షం ఎక్కువగా పడటం వల్ల కాస్త నష్టంవాటిల్లిందన్నది వాస్తవమే నని,  ఎక్కువ భాగం నష్టం రోడ్ల విషయంలో జరిగిందని అన్నారు. రూ.426 కోట్లు ఆర్‌ అండ్‌ బీ రోడ్ల విషయంలో, పంచాయతీ రాజ్‌ శాఖలో మరో రూ300 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో నంద్యాలలో వరదనష్టం లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా ఆయకట్టు, రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి నీటిని కృష్ణానదికి అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాయలసీమలోని ప్రతి జలాశయాన్ని నీటితో నింపుతామన్నారు. కుందూనదిని వెడల్పు చేసి వరదనష్టం నివారణకు చర్యలు తీసుకోవచ్చన్నారు. వరద బాధితుల్లో ప్రతి ఇంటికీ అదనంగా రూ.2వేలు సాయం చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *