స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు.. భారత యువ క్రికెటర్లు అరెస్ట్!

భారత క్రికెట్‌లో మరో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో యువ క్రికెటర్లు సీఎం గౌతమ్, అబ్రార్ కాజి‌లను బెంగుళూరు సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ లీగ్‌లో బళ్ళారి టస్కర్స్, హుబ్లీ టైగర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది. టస్కర్స్ టీమ్ తరపున ఆడిన ఈ ప్లేయర్స్ టార్గెట్ ఛేదించే క్రమంలో డిఫెన్సివ్ […]

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు.. భారత యువ క్రికెటర్లు అరెస్ట్!
Follow us

|

Updated on: Nov 07, 2019 | 8:54 PM

భారత క్రికెట్‌లో మరో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో యువ క్రికెటర్లు సీఎం గౌతమ్, అబ్రార్ కాజి‌లను బెంగుళూరు సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ లీగ్‌లో బళ్ళారి టస్కర్స్, హుబ్లీ టైగర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది.
టస్కర్స్ టీమ్ తరపున ఆడిన ఈ ప్లేయర్స్ టార్గెట్ ఛేదించే క్రమంలో డిఫెన్సివ్ బ్యాటింగ్ ఆడేందుకు బుకీ‌ల దగ్గర నుంచి రూ.20 లక్షలు తీసుకున్నారని  సమాచారం. దీంతో టస్కర్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 144 పరుగులు మాత్రమే చేసి.. 9 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఒక్క ఈ మ్యాచ్ మాత్రమే కాదు.. లీగ్‌ దశలో జరిగిన మరో మ్యాచ్‌లో కూడా వీరు ఇలాగే చేశారనడానికి రుజువులు లభించాయట.
‘కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్ జరిగిందని.. ప్రస్తుతం గౌతమ్, కాజిలను అరెస్ట్ చేశామని సీబీఐ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారు. లీగ్‌లో మరిన్ని మ్యాచ్‌ల్లో కూడా ఫిక్సింగ్ జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ జరుపుతున్నాం.. త్వరలోనే మరి కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని’ ఆయన అన్నారు. కాగా, ఈ కేసుపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.