ఈసీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

అమరావతి: ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన్ తీవ్ర స్థాయితో  ఫెయిల్ అయిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. వీవీప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్‌ వేస్తానని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు  స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఈసీఐని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నాలు చేసేందుకు సిద్ధమన్నారు. ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక […]

ఈసీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
Follow us

|

Updated on: Apr 12, 2019 | 2:50 PM

అమరావతి: ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన్ తీవ్ర స్థాయితో  ఫెయిల్ అయిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. వీవీప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్‌ వేస్తానని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు  స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఈసీఐని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నాలు చేసేందుకు సిద్ధమన్నారు. ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు? వారికి ఉన్న అర్హతలేంటో చెప్పాలని ఈసీని డిమాండ్‌ చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. వారిని ఏ ప్రాతిపదికన నియమించారని ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నారు.  ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్‌ను తానెప్పుడూ చూడలేదని మండిపడ్డారు.

వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఆరు రోజులు పట్టడమేంటని సీఎం ప్రశ్నించారు. గతంలో బ్యాలెట్‌ పత్రాలు లెక్కించే పద్ధతిలో ఎంత సమయం పట్టిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈవీఎం ఓటింగ్‌ నష్టాలపై సుప్రీంకు వెళ్లినా కూడా…అబద్దాలు చెప్పి బ్యాలెట్ పద్దతుల్లో ఓటింగ్ జరగకుండా చేశారని ఆరోపించారు. 5 కోట్లిస్తే ఒకడు ఈవీఎంలను తారుమారు చేసి ఎమ్మెల్యేలను చేస్తానంటున్నాడని…ప్రజాప్రతినిధుల భవిష్యత్‌ యంత్రాలపై ఆధారపడి ఉండడమేంటని సీఎం విమర్శించారు. ఏకధాటిగా రెండు గంటలపాటు యంత్రం పని చేయకపోతే రీపోలింగ్‌కు అవకాశముందని వివరించారు. ఉత్తరాంధ్ర, గోదావరి ప్రజలు సౌమ్యులుగా ఉంటారని…అక్కడ కూడా గొడవలు రెచ్చగొట్టారని సీఎం ఆరోపించారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..