ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు- చంద్రబాబు

ఈసీ ఏకపక్ష నిర్ణయాలను ఖండిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సమాజం ముందు చులకన అయ్యేలా ఈసీ ప్రవర్తిస్తుందని ఆయన ఆరోపించారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై సీఈవో ద్వివేదికి ఇవాళ ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఈవోను ఒక ముఖ్యమంత్రి కలవడం ఇదే తొలిసారి అని అన్నారు. తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని ద్వివేదికి చెప్పామన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని కోరామని చెప్పారు. దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్న […]

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు- చంద్రబాబు
Follow us

|

Updated on: Apr 10, 2019 | 3:27 PM

ఈసీ ఏకపక్ష నిర్ణయాలను ఖండిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సమాజం ముందు చులకన అయ్యేలా ఈసీ ప్రవర్తిస్తుందని ఆయన ఆరోపించారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై సీఈవో ద్వివేదికి ఇవాళ ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఈవోను ఒక ముఖ్యమంత్రి కలవడం ఇదే తొలిసారి అని అన్నారు. తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని ద్వివేదికి చెప్పామన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని కోరామని చెప్పారు. దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్న బాబు.. ఈసీ పరిధిలో లేకున్నా అధికారులను బదిలీ చేశారని, అకారణంగా కడప ఎస్పీని బదిలీ చేశారని దుయ్యబట్టారు. సీఎస్‌ను ఏకపక్షంగా బదిలీ చేశారని ఆరోపించారు. వైసీపీలో అవినీతిపరులపై ఎందుకు ఐటీ దాడులు జరగడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఐటీ దాడులతో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు డబ్బులు వెదజల్లుతున్నా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో 25 లక్షలు ఓట్లు తీసేస్తే క్షమాపణ చెప్పి వదిలేశారని విమర్శించిన బాబు.. తెలంగాణలో రూ.8 కోట్లు పట్టుబడినా చర్యలు లేవని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, జగన్‌ మాతోనే కలిసి ఉంటారని మోదీనే స్పష్టం చేశారని చంద్రబాబు అన్నారు.